రామ్ చరణ్ కోసం ఇద్దరు టాప్ హీరోయిన్ల పోటీ... చిక్కుల్లో పడ్డ సుకుమార్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు ఆర్సీ16గా వర్క్ టైటిల్ ను అనౌన్స్ చేసి శరవేగంగా షూటింగ్ పార్ట్ ను పూర్తి చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. ఇప్పటికే పలు షెడ్యూళ్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు యూనిట్. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే శివరాజ్ కుమార్ లుక్ టెస్ట్ కూడా పూర్తైంది. మరో షెడ్యూల్ లో ఆర్సీ16 టీమ్ ఫుల్ బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే.. 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ క్రేజ్ ను దక్కించుకుంది. వరల్డ్ వైడ్ గా చరణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. దీంతో ఆయన రాబోయే చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే చెర్రీ కూడా బిగ్ స్కేల్లోనే సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. కాస్తా హోం వర్క్ గట్టిగా చేసే డైరెక్టర్స్ తోనే వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు సినిమాను కంప్లీ చేస్తున్నారు. ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్సీ17గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. బిగ్ స్కేల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆర్సీ17 చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో 'రంగస్థలం' వచ్చి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా చరణ్ పెర్ఫామెన్స్ కు ఇండియా మొత్తం ప్రశంసలు కురిశాయి. ఇక మరోసారి సుకుమార్, రామ్ చరణ్ కాంబో రిపీట్ కాంబోతుడటంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే.... ఈ మూవీకి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
రామ్ చరణ్ కు జోడీగా ఆర్సీ17లో సుకుమార్ ఏ హీరోయిన్ ను ఫైనల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇద్దరు బడా హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ ఇద్దరు హీరోయిన్లతో వర్క్ చేసి మంచి రిజల్ట్ ను అందుకున్నారు. ఈ ఇద్దరూ సుకుమార్ కు ఫేవరెట్ హీరోయిన్లే కావడం విశేషం. దీంతో ఆర్సీ17కు ఎవరిని ఫైనల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే రామ్ చరణ్ - సమంత రూత్ ప్రభు 'రంగస్థలం'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. రష్మిక మందన్నను సుకుమార్ 'పుష్ప' సిరీస్ లో శ్రీవల్లిగా నేషనల్ క్రష్ ను చేశారు. మరోవైపు రష్మిక మందన్న ప్రస్తుతం వరుస బ్లాక్ బాస్టర్ హిట్లతో ఇండియాను షేక్ చేస్తోంది. సమంతకు పెద్ద ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. ఈ క్రమంలో ఊపులో ఉన్న రష్మిక మందన్నను ఫైనల్ చేస్తారా? లేకా డేట్స్ ఖాళీగా ఉన్న సమంతను ఫైనల్ చేస్తారా? అనేది వేచి చూడాలి. ఇన్ సైడ్ టాక్ మాత్రం సమంత పేరే గట్టిగా వినిపిస్తోంది. మున్ముందు దీనిపై ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి. ఇక రామ్ చరణ్ ఆర్సీ16 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నిన్న ఈ మూవీ నుంచి
జాన్వీ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ విడుదలై ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











