బన్నీ చేయనని వదిలేసిన కథ కోసం ఆ ఇద్దరు హీరోలు?
అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో సక్సెస్ తరువాత చాలా కొత్తగా అడుగులు వేస్తున్నాడు. వీలైనంత వరకు తన మార్కెట్ ని ఇతర భాషల్లో కూడా పెంచుకోవాలని చూస్తున్నాడు. అందుకే క్రేజ్ కి తగ్గట్లుగా ప్రాజెక్టులను కూడా సెట్ చేసుకుంటున్నాడు. ఇక గతంలో ఒకే చేసిన ప్రాజెక్టులపై కాస్త అనుమానాలు వచ్చినా పక్కన పెట్టేస్తున్నాడు. ఇక సుకుమార్ తో మొత్తానికి పుష్పను సెట్స్ పైకి తెచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా తరువాత వెంటనే ఐకాన్ అనే సినిమాను స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు శ్రీరామ్ దర్శకుడిగా ఆ ప్రాజెక్ట్ ప్లాన్ కూడా రెడీ అయ్యింది. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఎనౌన్స్ చేశారు. అయితే ఏమైందో ఏమో గాని సడన్ గా అల్లు అర్జున్ ఆ ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అవుట్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల కొరటాల శివ సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. బన్నీ హ్యాండ్ ఇవ్వడంతో ఐకాన్ దర్శకుడు, నిర్మాత మరో హీరో కోసం వేట మొదలు పెట్టారు.

ఇక ఆ లిస్ట్ లో రామ్ చరణ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో RRR తప్పితే మరొకటి లేదు. ఆ తరువాత ఎవరితో వర్క్ చేయాలి అనే విషయంలో ఇంకా ఒక క్లారిటికి రాలేదు. కానీ తప్పకుండా రెండు నెలల్లో ఎదో ఒక కొత్త ప్రాజెక్టును ఎనౌన్స్ చేయాలని అనుకుంటున్నాడు. అందుకే దిల్ రాజు ఐకాన్ ని చరణ్ ముందు ఉంచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక మరోవైపు నాని కూడా ఈ కథకు సెట్టయ్యే ఛాన్స్ ఉందని అతని బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్ లో కొంచెం మార్పులు చేయగలిగితే బావుంటుందని దర్శకుడు వేణు శ్రీరామ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వేణు ఇదివరకే నానితో మిడిల్ క్లాస్ అబ్బయి అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇక ఐకాన్ కథకు నాని గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఎలా తెరకెక్కిస్తారో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











