‘పింక్’ రీమేక్ అప్‌డేట్స్: టాలెంటెడ్ హీరోయిన్ కన్ఫార్మ్.. ప్రస్తుతానికి పవన్‌తో పని లేదట.!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఈయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. దీనికి కారణం స్టైల్, యాక్టింగ్‌లో విభిన్నమైన శైలిని కనబరచడమే. స్టార్ హీరోగా ఎదిగిన పవన్.. సామాజిక సేవలోనూ ముందుంటారు. గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆయన.. కొద్ది రోజుల క్రితం రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. అంతేకాదు, ఓ పార్టీని కూడా స్థాపించారు. ఇక, అప్పటి నుంచి ఆయన సినిమాలకు దూరం అయ్యారు. అయితే, కొద్ది రోజులుగా ఆయన రీ ఎంట్రీపై వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా దీనికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. వాటి గురించి తెలుసుకుందా.!

బడా నిర్మాతకే సాధ్యం అయింది

బడా నిర్మాతకే సాధ్యం అయింది

పవన్ కల్యాణ్ పాలిటిక్స్‌లో బిజీ అయిన తర్వాత చాలా మంది ఫిల్మ్ మేకర్లు ఆయన రీఎంట్రీ కోసం ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఏ నిర్మాతకూ సాధ్యం కాని దానిని దిల్ రాజు చేసి చూపించారు. బాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకున్న ‘పింక్' సినిమా రీమేక్‌తో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఆ ఇద్దరిపై పవర్‌ స్టార్ ఫైర్

ఆ ఇద్దరిపై పవర్‌ స్టార్ ఫైర్

పవర్ స్టార్ రీఎంట్రీ గురించి వార్తలు బయటకు వచ్చిన సమయంలోనే.. ఈ సినిమాకు పవన్ తీసుకునే రెమ్యూనరేషన్ గురించి కూడా ఆసక్తికరమైన ప్రచారం జరిగింది. ఇవన్నీ బయటకు రావడంతో ఈ స్టార్ హీరో.. దిల్ రాజుతో పాటు సహా నిర్మాత అయిన బోనీ కపూర్‌పై ఫైర్ అయ్యాడని గుసగుసలు వినిపించాయి. ఇది ఆ సమయంలో హాట్ టాపిక్ అయిపోయింది.

ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు

ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు

పింక్ రీమేక్‌లో పవన్ నటిస్తున్నారన్న వార్త అటు చిత్ర పరిశ్రమలోనూ.. ఇటు రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై దిల్ రాజు స్పందించారు. కొద్ది రోజుల క్రితం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్‌తో సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు, ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తామని ప్రకటించారు.

పవన్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్

పవన్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్

ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ‘పింక్'లో తాప్సీ చేసిన పాత్రకు, తెలుగులో టాలెంటెడ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నివేదా థామస్‌ను ఎంపిక చేశారట. యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర కావడానికి తోడు, పవన్ సినిమాలో అవకాశం అనగానే ఈ బ్యూటీ వెంటనే ఓకే చేసేసిందని అంటున్నారు.

వాళ్లకు పవన్‌తో పని లేదట

వాళ్లకు పవన్‌తో పని లేదట

ఈ సినిమాకు సంబంధించిన మరో విషయం కూడా ప్రచారం అవుతోంది. ఈ సినిమాను రెండు రోజుల్లోనే ప్రారంభించనున్నారని సమాచారం. పవన్ లేకుండానే దిల్ రాజు ఆఫీస్‌లో పూజా కార్యక్రమాలు జరుపుతారని అంటున్నారు. అలాగే, జనవరి నుంచి సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ అవుతుందట. మొదట్లో పవన్ లేని సీన్లను చిత్రీకరిస్తారనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X