యాంకర్ కమ్ ఆర్టిస్ట్ అయిన ఉదయభానుని గుర్తు పట్టని వారు అరుదు. అయితే ఈ మధ్యన ఆమె ఓ కొత్త సమస్యను ఎదుర్కొంటోందిట. ఆమె చేస్తున్న ఓ టీవి పోగ్రామ్ షూటింగ్ జరుగుతూంటే ఓ గ్రూప్ గా కొంతమంది కుర్రాళ్ళు పోగవుతున్నారు. వాళ్ళు ఆమె ఎక్కడ పోగ్రామ్ అంటే అక్కడ లాండ్ అయిపోతున్నారట. దాంతో ఆమెకు సెక్యూరిటీ కల్పించాలా అని శ్రేయాబిలాషులు అడిగారు. దానికామె స్పందిస్తూ..ఇప్పుడు నాకు సెక్యూరిటీ లేదని ఎలా భావిస్తున్నావు. వాళ్ళు ఎప్పుడూ నాపై ఓ కన్నేసే ఉంటారు.నా వెనుకే ఉంటారు. అయితే హైలెట్ కాకూడదని వారిని ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తున్నాను అంది. అయినా నా సెక్యూరిటీలో ఎక్కువ భాగం మా ఆయనే చూసుకుంటారు..నాకు బెంగేముంది..అని శెలవిచ్చింది. ఆమె ముందుచూపుని ఊహించని వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంటే ఆ వెనకపడే కుర్రాళ్ళు కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళటం మేలన్నమాట.