ఉదయ్ కిరణ్ : టాలీవుడ్‌ను భయపెడుతున్న డెత్ డేట్స్?
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో ఉదయ్ కిరణ్ ఈ రోజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయ్ కిరణ్ మరణం తెలుగు సినీ పరిశ్రమను ఒక్కసారిగా కుదిపేసినట్లయింది. ఇప్పటికే శ్రీహరి, ఏవీఎస్, దర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు వరుసగా నెలకొకరు చొప్పున మృత్యువాత పడటం, ఇపుడు ఉదయ్ కిరణ్ మరణంతో పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకున్నట్లయింది.
కాగా....ఈ నలుగురు మరణించిన డేట్స్ ఇపుడు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయ్యాయి. ఈ డేట్స్ అన్నీ ఒక వరుస క్రమంలో వస్తుండటంతో....ఫిబ్రవరి 5న ఇండస్ట్రీలో మరో విషాద సంఘటన ఏమైనా చోటు చేసుకుంటుందేమో? అనే భయాందోళనలు మొదలయ్యాయి. ఆ డేట్స్ పరిశీలిస్తే మీకూ ఆ అనుమానం రాక మానదు!

ప్రముఖ నటుడు శ్రీహరి అక్టోబర్ 9, 2013న మరణించారు. ఆ తర్వాతి నెల నవంబర్ 8వ తేదీన హాస్యనటుడు ఏవీఎస్ కన్నుమూసారు. అనంతరం డిసెంబర్ 7న మరో హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరణించారు. తాజాగా జవవరి 6వ తేదీన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా వరుసగా 9, 8, 7, 6వ తేదీల్లో పరిశ్రమలో నెలకొక విషాదం చోటు చేసుకుంటోంది.
ఈ నేపథ్యంలో నెక్ట్స్ వచ్చే నెల 5వ తేదీపై అందరి దృష్టి పడింది. అసలే సినీ పరిశ్రమలో తేదీలపై ఇలాంటి నమ్మకాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో.......ఫిబ్రవరి 5 వినగానే పరిశ్రమలో హడలిపోయే పరిస్థితి నెలకొంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా సినీ పరిశ్రమలో ఇలాంటి విషాదాల పర్వం ఇంతటితో ఆగిపోవాలని ఆశిస్తూ....ఈ సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమకు మంచి జరుగాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











