ఉదయ్‌కిరణ్‌-శ్వేతాబసు జంటగా..

By Staff

యువ కథానాయకుడు ఉదయ్‌కిరణ్‌-శ్వేతబసు ప్రసాద్‌ జంటగా యు.కె.ఎవెన్యూ ఉదయ్‌కిరణ్‌ సమర్పణలో సోమా విజయ ప్రకాష్‌ నిర్మాణ సారధ్యంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఫిలింస్‌ పతాకంపై సుభ సెల్వం దర్శకత్వంలో డి.కుమార్‌, యం.ఈశ్వరవరప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఆదివారం శ్రీ సత్యసాయి నిగమాగంలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు క్లాప్‌నివ్వగా ప్రసన్న కుమార్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేసారు. దర్శకనిర్మాత సాగర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా కథానాయకుడు ఉదయ్‌కిరణ్‌ మాట్లాడుతూ "మంచి సినిమా చేయాలనే తపనతో అందరం కలిసి ఈ చిత్రాన్ని చేస్తున్నాం. వినాయక చవితి పర్వదినాన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ చిత్రం ప్రారంభం కావడం చాలా ఆనందంగా వుంది" అన్నారు.

చిత్ర కథానాయిక శ్వేతబసుప్రసాద్‌ మాట్లాడుతూ "ఈ చిత్రంలో కథానాయికగా నటించడం చాలా ఆనందంగా ఉంది. దేవుని సమక్షంలో ప్రారంభమైన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు. నిర్మాత ఈశ్వర వరప్రసాద్‌ మాట్లాడుతూ "ఒక మంచి చిత్రంగా నిర్మించాలనే ఉద్ధేశ్యంతో మంచి తారాగణంతో ఈ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. నేటి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేయాలని ప్లాన్‌ చేసాం" అన్నారు. చిత్ర దర్శకుడు సుభ సెల్వం మాట్లాడుతూ "దర్శకుడిగా ఇది నా రెండవ సినిమా అన్నారు.

ఒక మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తానని తెలియజేస్తున్నాను" అన్నారు. సోమా విజయప్రకాష్‌ మాట్లాడుతూ "ఏ ఆటంకమూ లేకుండా నిర్విఘ్నంగా జరగాలనే ఉద్ధేశ్యంతో విఘ్నేశ్వరుడు పండుగనాడు వెంకటేశ్వరస్వామి సన్నిధిలో ఈ చిత్రం ప్రారంభిస్తున్నాం" అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత పల్లి కేశవరావు, రచయిత జనార్ధనమహర్షి, సంగీత దర్శకుడు ప్రదీప్‌ కోనేరు తదితరులు పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X