రాజకీయాల్లోకి ఉదయభాను? జనసేనపై ఆసక్తి!
హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్ ఉదయభాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన ఉదయభాను యాంకర్ గా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉదయభాను అంటే తెలియని వారు రాష్ట్రంలో ఉండరు అంటే సందేహం అక్కర్లేదు. ఈ నేపథ్యంలో పలు పార్టీలు ఆమెను సంప్రదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు. తనకు కొన్ని రాజకీయ పార్టీల నుండి ఆఫర్స్ వచ్చాయని, ప్రాధాన్యత కలిగిన పదవులు ఇస్తామని చెప్పారని కానీ, తాను అంగీకరించలేదన్నారు. తన కలం ద్వారా సమాజంలోని రుగ్మతల పైన పోరాడదల్చుకున్నట్లు చెప్పారు.

ఆమె రాను అని చెబుతున్నా.....కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం పదే పదే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారానకి సినిమా గ్లామర్ అవసరమని భావిస్తున్న పొలిటీషియన్స్ ఆమెను ఎలాగైనా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఉదయభాను మాత్రం ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయ ప్రసంగానికి ఆకర్షితురాలైందని, ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయడానికి సుముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. తనపై ఇతర రాజకీయ పార్టీల నుండి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఉదయభాను ఎలాంటి నిర్ణయం తీసుకోబోతంది? అనేది హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











