వేశ్యగా మారిన యాంకర్ ఉదయభాను!?
హైదరాబాద్: యాంకర్ ఉదయభాను గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తన వాక్ చాతుర్యం, చురుకుదనంతో బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ...సినిమాల్లోనూ తన మార్కను చాటుతోంది. ఇటీవల వచ్చిన పలు చిత్రాల్లో ఐటం సాంగులు చేస్తూ, హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ దర్శనం ఇచ్చింది.
తాజాగా ఉదయభాను గురించి ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఉదయభాను ఓ సినిమాలో వేశ్య పాత్ర చేస్తోందని ఫిల్మ్ నగర్ టాక్. 'మధుమతి' అనే టైటిల్‌పై రూపొందుతున్న ఈచిత్రానికి గాను ఉదయభాను ఈ పాత్ర చేస్తున్నట్ల సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్పి ఉంది.
ఇతర వివరాల్లోకి వెళితే..
ఉదయభాను ఈ మధ్య తరచూ రకరకాల వార్తలతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతోంది. ఇటీవల ఓ రూమర్ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. పూల రంగడు, అహనాపెళ్లంట చిత్రాల దర్శకుడు వీరభద్రం చౌదరితో ఉదయ భానుకు ఏదో 'సం'బంధం ఉందనేది ఆ వార్తల సారాంశం. అయితే తనపై వస్తున్న ఈ రూమర్లను ఉదయభాను తిప్పికొట్టింది. తమ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది.


Click it and Unblock the Notifications












