'టి.నగర్' సినిమాతో పరిచయం అయిన తమిళ హీరోయిన్ ఉదయతార ఆ సినిమా దర్శకుడు తిరుమలైని పెళ్ళి చేసుకుందని పుకారు ఇప్పుడు తమిళ పరిశ్రమను చుట్టుముడుతున్నాయి.సాధారణంగా హీరోయిన్లకు పెళ్లయింది...కాబోతోంది...గర్భవతి..వంటి వార్తలు బేజారు పుట్టిస్తాయి. అందులోనూ ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న ఉదయతార వంటి వాళ్లకు మరీనూ. దాంతో ప్రక్కింటి అమ్మాయి ఇమేజ్ సంపాదించుకుని కెరీర్ నిర్మించుకుంటున్న ఈ పందొమ్మిదేళ్ళ ముద్దు గుమ్మకిది పెద్ద సమస్యగా మారింది .ఈలోగా రిస్క్ తీసుకోవటం ఎందుకని అనుకున్నా నిర్మాతలనుండి వచ్చిన అవకాశాలు జారిపోవటం ప్రారంభమయ్యాయి. కంగారుపడిన ఉదయతార ఆరా తీసింది. దర్శకుడు తిరుమలై స్వయంగా ఈ తరహా ప్రచారానికి పూనుకున్నాడని తేలిందిట. దాంతో స్పీడుగా మీడియాని సమావేశపరిచి "తిరుమలై నాకు సోదర సమానుడు... అనవసరంగా పుకార్లు లేపి నా కెరీర్ ని నాశనం చేస్తున్నాడు" అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఈ విషయంపై దర్శకుడు తిరుమలై ని సంప్రదిస్తే "ఈ గొడవకు నాకు సంభంధం లేదు. ఆమెను కలిసి విషయం చర్చిస్తాను" అంటూ కూల్ గా సమాధానమిచ్చాడట. ఇది ఇలా ఉంటే పరిశ్రమ వాళ్లు మాత్రం ఆకు..ముల్లు సామెత గుర్తుకు వచ్చి నవ్వుకుంటున్నారు.