Pooja Hegde పూజా హెగ్డేకు సినిమా కష్టాలు.. డిప్రెషన్‌లోకి బుట్ట బొమ్మ అంటూ..!
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ భామ ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండేది. కానీ 'గుంటూరు కారం' సినిమా నుంచి ఎప్పుడైతే తప్పుకొందో, తప్పించారో తెలియదు కానీ.. ఈ భామకు సినిమా ఛాన్సులు రావడం లేదు. సినిమా ఛాన్సులు ఇవ్వండని పూజా హెగ్డే దర్శక నిర్మాతలను కోరుతుందంటూ క్రిటిక్ ఉమైర్ సంధు ఓ ట్వీట్ చేశాడు. ఇక ఆ ట్వీట్ వివరాల్లోకి వెళితే....
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డేకు సినిమా కష్టాలు మొదలు అయ్యాయి. జీవాతో కలిసి మాస్క్ అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. అసలు ఈ సినిమా తమిళ్. తెలుగులో డబ్ చేశారు. ఇక డైరెక్ట్ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది మాత్రం నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం అనే సినిమాతో. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.

ఇక అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. వరుసగా సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ అయిపోయింది పూజా హెగ్డే. ఇక ఆమె తెలుగులో అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించి హిట్ అందుకుంది. ఇక ఆ సినిమా తర్వాత ఆమె చేసిన బీస్ట్, రాధేశ్యాం, ఆచార్య అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక ఈ బ్యూటీ అందరికీ అన్ లక్కీగా మారిపోయింది. ఇక తర్వాత సినిమా గుంటూరు కారంలో నటిస్తుందని అంతా అనుకున్నారు.
అయితే ఏమైందో తెలియదు.. పూజా హెగ్డేను గుంటూరు మూవీ నుంచి తీసేశారో... లేదో ఆమె వెళ్లిపోయిందో తెలియదు కానీ... అప్పటి నుంచి ఆమెకు సినిమా కష్టాలు మొదలు అయ్యాయి. అటు హిందీలోనూ సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన మూవీ డిజాస్టర్ తర్వాత ఈ భామకు ఏ సినిమా కలిసి రావడం లేదు. ఇటీవల కాలంలో ఏ ఒక్క సినిమాలోనూ ఆమెకు ఛాన్స్ రావడం లేదట. ఇక ఈ విషయంపై క్రిటిక్ ఉమైర్ సంధు ఓ ట్వీట్ చేశాడు.

గతంలోనే ఉమైర్ సంధు పూజా హెగ్డే గురించి తప్పుగా ట్వీట్లు పెడితే ఈ భామ.. అతనికి నోటీసులు కూడా ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ భామను ఉమైర్ సంధు టార్గెట్ చేశాడు. తన ట్విట్టర్ వేదికగా ఓ వివాదాస్పద ట్వీట్ చేశాడు. ఒక్పపుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డే... ఇప్పుడు ఆమె సినిమాలు లేక తనను నటింపజేయాలని దర్శక నిర్మాతలను అడుక్కుంటుందని ట్వీట్ లో రాసుకువచ్చాడు.
అయితే పూజా హెగ్డేతో ఎవరు కలిసి పనిచేయడానికి ఇష్టపడటం లేదు.. తన ఫ్లాప్ కెరియర్ కారణంగా ఆమె డ్రిప్రెషన్ లో ఉంది.. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ భామ త్వరలో యాక్టింగ్ నుంచి తప్పుకోవాలని ఆలోచిస్తోందంటూ.. ఉమైర్ సంధు తన ట్విట్టర్ వేదికగా రాసుకువచ్చారు. ఇది చూసిన నెటిజన్స్... ఉమైర్ సంధుపై విరుచుకుపడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు ఇవేం ట్విట్లు అంటూ ఫైర్ అవుతున్నారు.

ఉమైర్ సంధు విషయానికి వస్తే.. గత కొన్నేళ్లుగా ఓవర్సీస్ రివ్యూయర్ అని చెప్పుకుంటూ... తెలుగు, తమిళ, హిందీ అనే తేడా లేకుండా ప్రతి సినిమా బాగుంది బాగోలేదు అని ట్విట్టర్ లో రాసుకువస్తున్నాడు. అక్కడివరకు ఆగితే బాగుండు. కానీ.. హీరో హీరోయిన్ల లైఫ్ పర్సనల్ విషయాలను కూడా ట్వీట్స్ చేయడం మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈయనపై పూజా హెగ్డే నోటీసులు పంపించింది. మరి ఈసారి ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా.. పోనీ అని వదిలేస్తుందా అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











