ప్రియుడి చేతిలో దారుణంగా మోసపోయిన స్టార్ హీరో కూతురు.. సెన్సేషన్‌గా ట్వీట్!
స్టార్ హీరో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది సారా అలీ ఖాన్. పేరుకు సైఫ్ అలీ ఖాన్ కూతురిగా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినా తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫలితంగా అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ గ్లామరస్ బ్యూటి సీక్రెట్ లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె బాయ్ ఫ్రెండ్ సారాను వదిలేశాడని, దీంతో ఆమె డిప్రెషన్ లో ఉందని ఓ ట్వీట్ సెన్సేషనల్ అవుతోంది.
కేదరినాథ్ మూవీతో:ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్ ముంబైలో 1995 ఆగస్టు 12న జన్మించింది. సైఫ్ అలీ ఖాన్, అతని మాజీ భార్య అమృత సింగ్ కుమార్తే సారా అలీ ఖాన్. 2016లో కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి గ్యాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ బ్యూటిఫుల్ బాలీవుడ్ స్టార్ హీరో కూతురిగా 'కేదార్‌నాథ్' అనే మూవీతో హిందీ చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది.

అవార్డులు అందుకుని:2018లో అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన 'కేదార్‌నాథ్' సినిమా సూపర్ సక్సెస్ అవడంతో పాటు ఉత్తమ డెబ్యూ యాక్ట్రస్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్, ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డును కైవసం చేసుకుంది. అంటే తొలి సినిమాతో నటనపరంగా తానేంటో నిరూపించుకుంది ఈ స్టార్ హీరో కూతురు.

భారీ విజయం:'కేదార్‌నాథ్' మూవీ తర్వాత 'టెంపర్' రీమేక్‌గా తెరకెక్కిన 'సింబా'లో నటించి మెప్పించింది హాట్ బ్యూటి సారా అలీ ఖాన్. రణ్ వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో సార్ ఫుల్ ఫేమస్ అయిపోయింది. దీంతో ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్ కు బాలీవుడ్ లో వరుసగా సినీ అవకాశాలు రావడం మొదలైంది.

ఓటీటీలో రిలీజ్:సారా అలీ ఖాన్ 'లవ్ ఆజ్ కల్', 'కూలీ నెంబర్ 1', 'అత్రంగీ రే' 'గ్యాస్ లైటర్' వంటి సినిమాల్లో నటించి మెప్పిచింది. వీటిలో నటనకు నటన, అందానికి అందంతో మంచి పేరును సంపాదించుకుంది. వీటిలో 'అత్రంగీ రే' 'గ్యాస్ లైటర్' ఓటీటీలో విడదలయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు మరిన్ని ఆఫర్లను పట్టేస్తోంది. ప్రస్తుతం 'అయి వాటన్ మేరే వాటన్' సినిమాతో పాటు జగన్ శక్తి తెరకెక్కించే సినిమాలో నటిస్తోంది.

క్రికెటర్ తో డేటింగ్..:సినిమాలతోనే కాకుండా లవ్ ట్రాక్ లతో కూడా సారా అలీ ఖాన్ తెగ పాపులర్ అయింది. అల వైకుంఠ పురములో హిందీ రీమేక్ షెహజాదే హీరో కార్తీక్ ఆర్యన్‌తో లవ్ ట్రాక్ నడుపుతూ హాట్ టాపిక్ అయింది. వీళ్లిద్దరూ చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఒకానొక సందర్భంలో విడిపోయినా మళ్లీ జంటగా కనిపించారు. ఇప్పుడు ఆమె క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తోనూ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
డేంజర్ జోన్ లో..:సారా అలీ ఖాన్ ను తన సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ దారుణంగా చీట్ చేశాడని వరుసగా షాకింగ్ ట్వీట్స్ చేసే సినీ క్రిటిక్ ఉమర్ సంధు పేర్కొన్నాడు. తాజాగా అతడు చేసిన ట్వీట్ లో.. "సారా అలీ ఖాన్ కెరీర్ డేంజర్ జోన్ లో ఉంది. వరుసగా చెత్త పర్ఫామెన్స్, ఓటీటీ డిజాస్టర్లు వచ్చాయి. మానసిక సంఘర్షణతో పోరాడుతోంది. రీసెంట్ గా ఆమెకు తన సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ దారుణంగా హ్యాండ్ ఇచ్చాడు. పాపం సెక్సీ హీరోయిన్" అని రాసుకొచ్చాడు. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











