ప్రియాంక చోప్రా భర్తకు సీక్రెట్ అఫైర్.. అలా దొరికిపోయిన నిక్ జోనాస్.. సంచలనంగా ట్వీట్!
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ స్థాయిలో సత్తా చాటుతోంది. హిందీ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ అక్కడ అగ్ర హీరోలందరితో ఆడిపాడింది. క్రిష్, తుఫాన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
ఇక హాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన ఈ భామ తాజాగా సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా నిక్ జోనాస్ చేసిన పనికి వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

మిస్ వరల్డ్ టైటిల్: బాలీవుడ్, హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న స్టన్నింగ్ బ్యూటి ప్రియాంక చోప్రా 1982 జూలై 18న జంషెడ్ పూర్ లో జన్మించింది. మోడలింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ సుందరి 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెతో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టారు.

హిందీలో పాపులర్: ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా 2002లో తమిజాన్ అనే తమిళ చిత్రంతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. అనంతరం 2004లో ఐత్రాజ్ అనే బాలీవుడ్ మూవీతో డెబ్యూ చేసింది. ఈ సినిమాలో మంచి నటన కనబర్చిన ముద్దుగుమ్మకు ప్రశంసలు దక్కాయి. తర్వాత క్రిష్, డాన్, ఫ్యాషన్ వంటి సినిమాలతో హిందీలో తెగ పాపులర్ అయింది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ.

చెర్రీతో సినిమా: అంతేకాకుండా ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ సైతం అందుకుంది గ్లామరస్ బ్యూటి ప్రియాంక చోప్రా. హిందీలోనే కాకుండా తెలుగు సినిమాల్లో కూడా నటించింది ఈ సుందరి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి జంజీర్ తెలుగులో తుఫాన్ సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీని తర్వాత తెలుగులో ప్రియాంకకు అవకాశాలు రాలేదు.
క్వాంటికోతో ఎంట్రీ: హిందీలో స్టార్ హీరోయిన్ రేంజ్ లో కొనసాగుతున్న ప్రియాంక చోప్రాకు హాలీవుడ్ నుంచి ఆఫర్లు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే 2015లో క్వాంటికో అనే టీవీ సిరీసుతో హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కాలు మోపింది ఈ భామ. ఇందులో FBI ఏజెంట్ అలెక్స్ పారిష్ ప్రధాన పాత్రలో ఆకట్టుకుంది. క్వాంటికో మూవీ సక్సెస్ సాధించడమే కాకుండా ప్రియాంక నటనకు హాలీవుడ్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు.

రొమాంటిక్ సన్నివేశాలు: స్టన్నింగ్ బ్యూటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో బేవాచ్, ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్, ది వైట్ టైగర్, ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ చిత్రాలు చేసింది. అలాగే ది జంగిల్ బుక్, ప్లేన్స్ వంటి యానిమేషన్ మూవీస్ కు వాయిస్ ఓవర్ అందించింది. తాజాగా సిటాడెల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రిచర్డ్ మ్యాడెన్ తో కలిసి యాక్షన్, రొమాంటిక్ సన్నివేశాల్లో అదరగొట్టింది.

పదేళ్లు చిన్నోడు: ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను 2018 డిసెంబర్ లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది. అయితే తాజాగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నట్లు క్రిటిక్ గా చెప్పుకునే ఉమర్ సంధు తన ట్వీట్ లో తెలిపాడు.
అఫైర్.. గొడవలు: "బ్రేకింగ్ న్యూస్.. ప్రియాంక చోప్రా ఆమె భర్త నిక్ జోనాస్ ఇటలీలోని రోమ్ లో దారుణంగా గొడవ పడ్డారు. అంతర్గత మూలాల ప్రకారం నిక్ జోనాస్ కు సీక్రెట్ అఫైర్ ఉంది. అలా సీక్రెట్ అఫైర్ సాగిస్తున్న భర్త నిక్ జోనాస్ ను ప్రియాంక చోప్రా పట్టుకుంది. వాళ్లిద్దరి మధ్య అంతా సజావుగా సాగడం లేదు. మనస్పర్థలు చోటు చేసుకున్నాయి" అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు ఉమర్ సంధు. దీంతో ఈ ట్వీట్ సంచలనంగా మారింది. కానీ ఈ మధ్య ఉమర్ సంధు అన్నీ ఇలాంటి గాసిప్ ట్వీట్స్ పెడుతూ సెలబ్రిటీలుగా తలనొప్పిగా మారాడు.


Click it and Unblock the Notifications











