సూపర్‌స్టార్‌తో యువ హీరోయిన్ బ్రేకప్.. గొడవపడి.. కొట్టుకొని గుడ్‌బై
సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తున్నది. వ్యక్తిగత జీవితమే కాకుండా ప్రొఫెషనల్ జీవితం కూడా సందిగ్దంలో పడింది. గతేడాది ఆయన నిర్మించిన లాల్ సింగ్ చద్దా చిత్రం డిజాస్టర్ తర్వాత ప్రొఫెషనల్‌గా సైలెంట్ అయిపోయారు. అయితే ఇటీవల కాలంలో దంగల్ ఫేమ్ సానా ఫాతీమా షేక్‌తో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వారిద్దరి అఫైర్ గురించిన వివరాలను ప్రముఖ క్రిటిక్ షేర్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
గత రెండు, మూడేళ్లుగా అమీర్ ఖాన్ పరిస్థితి దారుణంగా కనిపిస్తున్నది. టర్కీ ప్రథమ పౌరురాలిని కలువడం వివాదంగా మారింది. ఆయన నటించిన లాల్ సింగ్ చద్దా దారుణమైన ఫ్లాప్‌గా మారింది. లాల్ సింగ్ చద్దా షూట్ సమయంలోనే తన రెండో భార్యకు విడాకులు ఇచ్చారు. దాంతో అటు పర్సనల్, సినిమా లైఫ్‌కు చిన్న బ్రేక్ పడింది.

ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి డైరెక్టర్ కిరణ్ రావును వివాహం చేసుకొన్నారు. కిరణ్ రావు, అమీర్ ఖాన్ కలిసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి సక్సెస్‌ఫుల్ సినిమాలను అందించారు. వారిద్దరికి కుమారుడు కూడా పుట్టారు. అంతా సవ్యంగా జరుగుతున్నదనే సమయంలో కిరణ్ రావు, అమీర్ ఖాన్ విడిపోయారు.
అయితే కిరణ్ రావుతో విడాకులు కారణం దంగల్ ఫేమ్ ఫాతీమా సనా షేక్‌లో అమీర్ ఖాన్‌కు ఉన్న అఫైర్ అనే వార్తలు మీడియాలో భారీగా ట్రెండ్ అయ్యాయి. పలుమార్లు వారిద్దరు కలిసి కూడా కనిపించడం మీడియా వార్తలకు బలం చేకూరింది. అయితే ఈ రూమర్లపై అమీర్ గానీ, సనా ఫాతీమా షేక్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ వారి అఫైర్ గురించి వార్తలు మాత్రం గుప్పు మంటూనే ఉన్నాయి.

అయితే అమీర్ ఖాన్, ఫాతీమా సనా షేక్ రిలేషన్‌షిప్ గురించి బాలీవుడ్ క్రిటిక్ ఉమేర్ సంధూ దారుణంగా కామెంట్లు చేయడం చర్చనీయాంశమైంది. వ్యక్తిగత అభిప్రాయ బేధాలు తలెత్తడంతో అమీర్, సనా కొట్టుకొన్నారు. సనాకు తగిన సమయం ఇవ్వడం లేదనే కారణంతో వారి మధ్య గొడవలు వచ్చాయి. వారిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది అని సనా స్నేహితుడు తెలిపారని ఉమేర్ సంధూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
సానా ఫాతీమా షేక్ కెరీర్ విషయానికి వస్తే.. రెండు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నది. ధక్ ధక్, సామ్ బహద్దూర్ అనే చిత్రాల్లో నటిస్తున్నది. సామ్ బహద్దూర్ చిత్రంలో ఇందిరా గాంధీగా కనిపించబోతున్నారు. ఈ రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అమీర్ ఖాన్ సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











