twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉండవల్లి 'రామోజీ'సీరియల్ కి మోక్షం?

    By Staff
    |

    Romoji rao
    రామోజీరావు పై ఎప్పటినుంచో సీరియల్ చేస్తానంటూ చెప్పుకొస్తున్న ఉండవల్లి త్వరలోనే ఆ ఆలోచనలకు ప్రాణం పోసేటట్లు కనపడుతున్నారు. టీవీ కోసం తానొక సీరియల్ నిర్మిస్తున్న విషయాన్ని ఉండవల్లి శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ ధ్రువీకరించారు. రామోజీ జీవిత చరిత్ర ఆధారంగానే ఈ సీరియల్ ఉండబోతోందా అని అడిగినప్పుడు, రామోజీతో రాజీలేని పోరాటంతోనే తన పేరు బాగా ప్రచారం లోకి వచ్చిందనీ, దీంతో తాను తీసే సీరియల్ రామోజీపైనే ఉండబోతోందని అనుకుంటే ఎలా అని అని నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. సమకాలీన రాజకీయ అంశాలతో ఈ సీరియల్ ఉంటుందనీ, ఇందులో చాలా పాత్రలే ఉంటాయనీ వివరణ ఇచ్చారు.

    అలాగే ఇప్పటికే ఆ సీరియల్ కోసం ఇరవై ఎపిసోడ్లు వరకూ రెడీ అయ్యాయని ఆయన అన్నారు. అసలు తన దగ్గర ఒక సినిమా తీసేందుకు అవసరమైన మంచి స్క్రిప్టు కూడా ఉందనీ, ఎవరైనా నిర్మాత ముందుకు వస్తే సినిమా తీయాలనుకుంటున్నాననీ మరో బాంబు విసిరారు. చిన్నప్పటి నుంచి తనకు సినిమాలంటే ఇష్టమనీ, అసలు జనాలకు బాగా చేరువ కావాలంటే సినిమాకు మించిన మాధ్యమం లేదనీ ఈ సందర్భంగా ఉండవల్లి చెప్పుకొచ్చారు.

    ఇక ఈ సీరియల్ లో ప్రధాన పాత్ర రామోజీ శైలికి అనుకరణ. ఆ పాత్రకి రాఘవేంద్రరావు అనే పేరు పెట్టారు. అయితే అప్పట్లో ఆ సీరియల్‌ను ప్రసారం చేయడానికి ప్రధాన టీవీ చానళ్లేవీ ముందుకు రాలేదు. రామోజీతో గొడవకి అవేవీ సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో కొంత కాలం నుంచీ ఆ సీరియల్ డబ్బాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. అయితే ఇప్పుడు ఉండవల్లి ముఖంలో ఆనందం తొంగి చూస్తోంది.కారణం సమీప భవిష్యత్తులో ఆ సీరియల్ వెలుగు చూసే అవకాశం ఉండటమే. వైఎస్ జగన్ ప్రారంభించిన సాక్షి చానల్‌లో అది ప్రసారమయ్యే అవకాశాలున్నట్లు ఆ మధ్య చెప్పుకొన్నారు. అయితే ఈరోజు టీవీ ఛానెల్స్ పెరగటంతో ఏదో ఒక కాంగ్రేస్ సపోర్టు ఛానెల్ లో వేసే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే మరోసారి రామోజీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తవచ్చునని పరిశీలకులు అంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X