సాక్షిలో రామోజీ పై సీరియల్?

ఇందులోని ప్రధాన పాత్ర రామోజీ శైలికి అనుకరణ. ఆ పాత్రకి రాఘవేంద్రరావు అనే పేరు పెట్టారు. అయితే అప్పట్లో ఆ సీరియల్‌ను ప్రసారం చేయడానికి ప్రధాన టీవీ చానళ్లేవీ ముందుకు రాలేదు. రామోజీతో గొడవకి అవేవీ సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో కొంత కాలం నుంచీ ఆ సీరియల్ డబ్బాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. అయితే ఇప్పుడు ఉండవల్లి ముఖంలో ఆనందం తొంగి చూస్తోంది.
కారణం సమీప భవిష్యత్తులో ఆ సీరియల్ వెలుగు చూసే అవకాశం ఉండటమే. వైఎస్ జగన్ ప్రారంభించిన సాక్షి చానల్‌లో అది ప్రసారమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ సీరియల్ పట్ల జగన్ ఆసక్తి ప్రదర్శించినట్లు, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే ఆ సీరియల్‌ను ప్రసారం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అలాగే కాంగ్రేస్ అధికారంలోకి వచ్చినా రాకపోయినా సీరియల్ రావటం మాత్రం ఖాయం అనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే మరోసారి రామోజీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తవచ్చునని పరిశీలకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications