twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్ గుఱ్ఱం ఎక్కిమ్మంటే రిచ్ గా ఏనుగెక్కించాడు..అందుకే..?

    By Sindhu
    |

    ఎన్‌.టి.ఆర్‌. శక్తి సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందనేది విడుదలనాడే తెలిసిపోయింది. హడావుడి వంటకంలా తయారైన ఈ సినిమాకు కథలో క్లారిటీ లేకపోవడం, స్క్రీన్‌ప్లే లోపించడం... ప్రభు కంటిన్యూ షాట్‌లోనే లోపాలు ఉండటం.. ఇలా ఎన్నో తప్పులున్నాయి. దర్శకుడు, నిర్మాత ఈ విషయంపై సరైన క్లారిటీ తీసుకోలేదని తెలిసింది. అయితే ఈ చిత్రం విడుదలయిన ఐదు రోజులతర్వాత మీడియాకు ప్రత్యేకమైన షో ఏర్పాటు చేశారు. సహజంగా ముందుగానే చూపిస్తారు. అశ్వనీదత్‌ కాబట్టి అస్సలు చూపించడు అనేది అందరికీ తెలిసిందే. కానీ, రిలీజ్‌తర్వాత షో వేస్తే ఎవ్వరూ చూడ్డానికి ఆసక్తిచూపకపోవడంతో... అర్థాంతరకంగా క్యాన్సిల్‌ చేశారు. దీంతో శక్తి సినిమా స్టామినా ఏమిటో ఆయనకు తెలిసి వచ్చింది.

    కాగా మగధీర అంత పెద్ద హిట్ అయ్యే సరికి తనపై కూడా అంత బడ్జెట్ పెడితే, తను కూడా గుర్రమెక్కితే సినిమా అంతకంటే పెద్ద హిట్ అవుతుందని ఆశించాడు కాబోలు జూ ఎన్టీఆర్ 'అంకుల్ నేనూ గుర్రమెక్కుతా" అని ఆశగా అడిగిన ఎన్టీఆర్ ని కాదనలేక అశ్వనీదత్ నలబై అయిదు కోట్లు తనవి కాదనుకున్నాడు. అయితే ఆ బడ్జెట్ కి గుర్రం ఏమి ఆనుతుందని, తమ సినిమా అన్నిట్లోను కాస్ట్ లీగా ఉండాలని మెహర్ రమేష్ మధ్యలో పుల్లేశాడు. రిచ్ గా ఏనుగెక్కించి హీరోని పరిచయం చేద్దామని, అడవి రాముడులో పెద్ద ఎన్టీఆర్ ని జనం గుర్తు చేసుకుంటారని ఆశపెట్టాడు. దాంతో జూ ఎన్టీఆర్, మెహర్ రమేష్ అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. అరచేతిలో గజరాజుని చూపించిన మెహర్ రమేష్ చివరకు దాంతోనే తమని తొక్కించి దిమ్మదిరిగేట్టు చేశాడని వారికి లేటుగా అర్థమైంది.

    English summary
    Story of 'Shakti' has basis in Egypt’s ancient times combined with fiction backdrop. The cine folks say that best available way to heighten Jr NTR in 'Shakti' with the given story and locations would be to explore the unseen horse riding skills in young tiger. Till today none of directors attempted Jr NTR on a horse.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X