పవన్ కల్యాణ్ BRO క్లైమాక్స్ లీక్: చివరి 18 నిమిషాలు ఊహించని విధంగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. అందుకే ఈ బడా హీరో రీఎంట్రీలో తన అభిమానులను మరింత ఉత్సాహ పరిచేలా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇలా మరికొద్ది రోజుల్లోనే 'బ్రో (BRO)' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మెగా మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నుంచి తరచూ కొన్ని వార్తలు లీక్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఎవరూ ఊహించని వార్త బయటకు వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూడండి!

మెగా హీరోలతో 'బ్రో (BRO)': మెగా హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమానే 'బ్రో (BRO)'. సముద్రఖని తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేశారు. దీనికి థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రం 'వినోదయ సీతమ్' అనే తమిళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

రిలీజ్‌కు చేరువ.. అన్నీ పూర్తి: మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న 'బ్రో (BRO)' మూవీని జూలై 28వ తేదీన విడుదల చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే చాలా తక్కువ సమయంలో ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకున్నారు. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను ఇప్పటికే పూర్తి చేసేశారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా నుంచి ఎన్నో అప్‌డేట్లను వరుసగా ఇస్తూ ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తున్నారు.

ప్రమోషన్స్.. ట్రైలర్ ఈరోజే: డివోషనల్ కాన్సెప్టుతో తెరకెక్కిన 'బ్రో (BRO)' మూవీ రిలీజ్‌కు డేట్ దగ్గర పడుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలపై ఫోకస్ చేసింది. ఇలా ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఎన్నో పోస్టర్లను, పాటలను, టీజర్‌ను రిలీజ్ చేసింది. వీటన్నింటికి ప్రేక్షకులు, మెగా అభిమానుల నుంచి భారీ స్థాయిలో స్పందన కూడా వచ్చింది. ఇక, నేడు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు.

బ్రో మూవీ రన్ టైం ఇంతే: పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబోలో రాబోతున్న 'బ్రో (BRO)' మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడడంతో సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. దీనికి బోర్డు క్లీన్ యూ సర్టిఫికెట్‌ను ఇచ్చింది. ఇక, 'బ్రో (BRO)' మూవీ కేవలం 136 నిమిషాలు (యాడ్స్‌తో కలిపి) నిడివితోనే వస్తుంది. అంటే ఈ సినిమా రెండు గంటల పదహారు నిమిషాలే ఉంటుంది.

పవన్ ఎంట్రీ అప్పుడే అని: దేవుడు - భక్తుడు - వరం అనే స్టోరీలైన్‌తో రాబోతున్న 'బ్రో (BRO)' మూవీలో పవన్ కల్యాణ్ రోల్ సినిమా మొదలైన 20 నిమిషాల తర్వాతనే ప్రారంభం అవుతుందని ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ లీక్ చేశాడు. అంతేకాదు, మొత్తం మూవీలో అతడి పాత్ర 95 నిమిషాల లోపే కనిపిస్తుందని కూడా ఓ న్యూస్ లీకైంది. కానీ, అతడు ఉన్నంత సేపూ అదిరిపోయే సీన్స్ ఉంటాయని టాక్.

బ్రో క్లైమాక్ ఊహించనట్లు: 'బ్రో (BRO)' మూవీలో పవన్ కల్యాణ్ పాత్ర ఆలస్యంగా ఎంట్రీ ఇస్తుందని ముందే చెప్పుకున్నాం. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా క్లైమాక్స్‌లో సైతం పవర్ స్టార్ పాత్ర కనిపించదట. ముఖ్యంగా చివరి 18 నిమిషాల్లో అతడి స్క్రీన్ ప్రజెన్స్ ఉండదని తెలిసింది. ఇది నిజంగా మెగా అభిమానులకు షాకింగ్ న్యూసే అని చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications











