ఛార్మి పై బ్యాన్?
ఛార్మి న్యూస్ లు ఇంటర్వూలపై మీడియా బ్యాన్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన మీద రాసుకునే వార్తలతోనే మీడియా బ్రతుకుతున్నట్లు ఛార్మి వ్యవరిస్తూ మాట్లాడటం చాలా మందిని భాధపెట్టడమే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. అలాగే ఇంతకుముందు వద్దంటే ఇంటర్వూ తీసుకోమని వెంటబడే ఛార్మి మంత్ర విజయంతో ఇంటర్వూ ఇవ్వటానికి కూడా చాలా ఇబ్బంది పెడ్తోంది. ఆమెతో చిట్ చాట్ తేవాలన్నా ఆస్కార్ వచ్చినంత హంగామా జరుగుతోంది. అంతేగాక ఇంటర్వూల్లో ఏయే ప్రశ్నలు అడగాలో కూడా ముందే తెలుసుకునే తర్వాత ఒప్పుకోవటం చాలా మంది సీనియర్స్ ని భాధపడ్తోంది.
అలాగే తన సినిమాలు ఫెయిల్యూర్ అయినప్పుడు రివ్యూలు ఫ్లాఫ్ అని రాస్తున్నారని, అట్లా చేయటం పద్దతి కాదంటూ చెప్తోంది. ఇవ్వన్నీ చూసి ిసిగిన వారు ఛార్మికి మీడియా అవసరం లేనప్పుడు మీడియాకు మాత్రం ఛార్మి అవసరం ఏముంది అని ఆమెపై అనధికార బ్యాన్ పెట్టారు. అది మనోరమ సినిమాపై పడింది. ఆమె ప్రధాన పాత్రలో చేసిన ఆ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమాకు కొద్దిగా కూడా మోసే వారు కరువయ్యారు. అంతేగాక తర్వాత ఆమె చేయబోయే సినిమాలకు కూడా ప్రమేషన్ చేయమని తేల్చి చెప్పేసారు.


Click it and Unblock the Notifications











