అత్తగారి దారిలోనే రామ్ చరణ్ కాబోయే భార్య??
రామ్ చరణ్ కాబోయే భార్య ఉపాసనా కామినేని పెళ్లి కాకముందు నుంచే అత్తగారి దారిలో ప్రయాణిస్తోందంటున్నారు. మెగాస్టర్ చిరంజీవి సినిమా నటుడుగా ఉన్నంతకాలం ఆయన భార్య తన భర్యతో చేసే హీరోయిన్స్ తో చాలా స్నేహంగా ఉండేది. సుహాసిని,రాధిక,రాధ,సుమలత వంటివారుతో ఆమె ఎప్పుడూ కలిసి మాట్లుడూతూ ఉండేది. ఇప్పుడదే సీన్ ని ఉపాసన కూడా రిపీట్ చేస్తోందంటున్నారు. ఆమె రామ్ చరణ్ తో రచ్చలో చేసిన తమన్నా,చరణ్ తదుపరి చిత్రంలో చేస్తున్న కాజల్ తో ఆమె గుడ్ రిలేషన్స్ మెయింటైన్స్ చేస్తోందని వినికిడి. తమన్నాతో ఆమె రీసెంట్ గా డిన్నర్ కి ఆహ్వానించింది. కాజల్ ని సెట్ కి వెళ్లి మరీ పలకరించింది. ఇవి ముందు జాగ్రత్తలా లేక ప్రొఫిషనల్ రిలేషన్ షిప్పులా అనేది ఇండస్ట్రీలో ఈ మ్యాటర్ చర్చనీయాంసంగా మారింది.
రామ్ చరణ్ తన కాబోయే భార్య ఉపాసన గురించి మీడియాతో మాట్లాడుతూ... ఖచ్చితంగా చెప్పాలంటే మా ఇద్దరిలో ఉపాసనే బాగా రొమాంటిక్. అలాగే మా ఇద్దరి మధ్యా అప్పుడప్పుడూ ఒపినియన్స్ లో డిఫెరెన్సెస్ వస్తూంటాయి. కానీ ఉపాసనే ఎప్పుడూ ఆర్గ్యుమెంట్ ని బ్రేక్ చేసి మళ్లీ మామూలు వాతావరణం నెలకొల్పేలా చేస్తుంది. అందుకే ఆమె అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు రామ్ చరణ్ తేజ. ఆయన రీసెంట్ గా ఓ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ఉపాసన ఎప్పుడూ నాకెప్పుడూ యాక్టింగ్ గురించి సలహాలు ఇవ్వదు. మా వృత్తులు గురించి మేమెప్పుడూ మాట్లాడుకోం. ఇద్దరం కలిసి సినిమాలు చూస్తూంటాం. అయితే ఇద్దరం కలిసినప్పుడు మాత్రం సినిమా గురించి మాట్లాడుకోం అన్నారు. ఇక మేమిద్దరం పర్శనాలిటీల పరంగా ఉత్తర దక్షిణ ధృవాల లాంటివాళ్లం.
అదే మమ్మల్ని కలిపి ఉంచేది అని నేను భావిస్తూంటాను. మేమిద్దరం ఇద్దరం విభిన్నమైన వ్యక్తులం కాబట్టే మేము మాకు ఎప్పుడూ బోర్ కొట్టం అని అనుకుంటున్నాను. నేను ఓ రిజర్వ్ గా ఉండే వ్యక్తిని, కానీ ఉపాసన నన్ను దాన్నించి తప్పించగలదు. ఆమె చాలా ఓపెన్ గా మాట్లాడే వ్యక్తి. అందుకేనేమో మేము ఒకరికొకరు నచ్చాం. ఇద్దరం ఆలోచనలు కలిసిపోయాయి. అందుకే మా ప్రేమ ప్రయాణం సజావుగా సాగుతోంది అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం జంజీర్,ఎవడు,వినాయిక్ చిత్రాలలో బిజీగా ఉన్నారు. తన పెళ్ళి సమయానికి తన చేతిలో ఉన్న ప్రాజెక్టులు పెండింగ్ ఉండకూడదు అని భావిస్తున్నారు.
ఇక రామ్ చరణ్,ఉపాసనల వివాహం జూన్ 14న ఫిక్స్ చేసారు. ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిముషాలకు ఈ ముహూర్తాన్ని ఖరారు చేసారు. అయితే వివాహ వేదిక ఎక్కడన్నది ఇప్పటివరకూ ఫైనలైజ్ కాలేదు. వధువు తరపు వారు తమ దోమకొండ సంస్ధానంలో నిర్వహించాలని భావిస్తూంటే,చిరంజీవి మాత్రం తిరుపతిలో చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుతెలుస్తోంది. అతి త్వరలోనే ఏ విషయం తెలుస్తుంది. ఇక వీరి వివాహ నిశ్చితార్ద ఆ మధ్యన హైదరాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్ లో వైభవంగా జరిగింది.


Click it and Unblock the Notifications











