'రచ్చ' ఆడియోకు ఛీప్ గెస్ట్ ఆమెనే
రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ ఆడియో ఈ నెల 11న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియోకు ఛీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్ ఉడ్ బి ఉపాసన రానుందని సమాచారం. ఆమె చేతుల మీదుగానే ఆడియోను విడుదల చేసే అవకాసముందని చెప్పుకుంటున్నారు. అయితే ఆమె ఫంక్షన్ కి వస్తాను కానీ స్టేజీ మీదకు రానని,తన చేతుల మీదుగా ఆడియో విడుదల చేయనని చెప్తోందని అంటున్నారు. రామ్ చరణ్ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.
రచ్చ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. పరాస్ జైన్, ఎన్వీ ప్రసాద్ మెగా సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్ పై 'రచ్చ' చిత్రాన్ని రూపొందిస్తుననారు. మణిశర్మ సంగీతం సంగీతం అందిస్తున్నారు. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రచ్చ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆరెంజ్ ప్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈచిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రానికి సమర్పణ: ఆర్.బి.చౌదరి, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











