అందరికీ షాక్ ఇవ్వబోతున్న ఉపాసన
హీరో రామ్ చరణ్ కాబోయే భార్య ఉపాసన కామినేని త్వరలో అందరికీ షాక్ ఇవ్వడానికి సిద్దం అవుతోంది. బహుషా పెళ్లి సమయం దగ్గర పడేనాటికి ఇది జరుగవచ్చునేమో. ఇందుకు ఓ బలమైన కారణం కూడా ఉంది. ఇటీవల పోలో మ్యాచ్ సందర్భంగా తొలిసారిగా చెర్రీతో కలిసి బయటి ప్రపంచానికి కనిపించిన ఉపాసనను చూసి చాలా మంది అసంతృప్తికి గురయ్యారు. చరణ్ స్టైల్ కి, ఫిజిక్ కి ఉపాసన మ్యాచ్ కాక పోవడమే ఇందుకు కారణం.
ఈ విషయం కాస్త ఉపాసన చెవిలో పడిందట. దీంతో చరణ్ స్టైల్ కు తగిన విధంగా తన బాడీని ట్యూన్ చేసుకోవడానికి సిద్దం అవుతుందని సమాచారం. బరువు తగ్గేందుకు తగిన ఎక్సర్ సైజులు, ట్రీట్ మెంటుతో పాటు....ముఖానికి కాస్మొటిక్ సర్జరీ చేయించుకునేందుకు సన్నద్ధమైందని తెలుస్తోంది. చరణ్ కు తాను తగిన జోడీ కాదని విమర్శిస్తున్న వారి నోరు మూయించేందుకే ఉపాసన ఈ చర్యకు ఉపక్రమించిందని ఆమె సన్నిహిుతులు చర్చించుకుంటున్నారు.
సినిమాల్లోకి కాక ముందు రామ్ చరణ్ పర్సనాలిటీ 'హీరో"రేంజ్ లో ఉండేది కాదు. అందుకే చిరుత సినిమాలో చరణ్ రూపం అంతగా ఆకట్టుకోలేక పోయింది. అయితే మగధీరలో చరణ్ ను చూసి అంతా ఆశ్చర్య పోయారు. ఇందు కోసం చరణ్ తెర వెనక చాలా కసరత్తే చేశాడు. తాజాగా ఉపాసన కూడా చరణ్ ను ఫాలో అవుతోంది.


Click it and Unblock the Notifications











