Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నెక్స్ట్ టార్గెట్ దాసరి, ఆర్తి అగర్వాల్, ఉదయ్ కిరణ్.. ఓటీటీలో బయోపిక్స్ ప్లాన్?
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్స్ హవా ఏ రేంజ్ లో నడుస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కాంట్రవర్సీ ఉన్న కథలకు ప్రమోషన్స్ లేకపోయినా కూడా మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఇక రానున్న రోజుల్లో ఊహించని విధంగా మరణించిన స్టార్స్ జీవితలు కూడా సినిమాగా రూపొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం స్పెషల్ గా OTT రంగం కూడా సిద్ధమైంది. త్వరలో ఆర్తి అగర్వాల్, దాసరి నారాయణ రావు అలాగే ఉదయ్ కిరణ్ లాంటి వారి కథలు డిజిటల్ వరల్డ్ లోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
సావిత్రి బయోపిక్ తరువాత
మహానటి సావిత్రి బయోపిక్ తరువాత ఇండస్ట్రీలో రియాల్ లైఫ్ కథలకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఎమోషనల్ కథలపై జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకోసమే కొంతమంది దర్శకులు అలాంటి కథలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆ దారిలో నడిచి కొంత సక్సెస్ అయిన విషయం తెలిసిందే.
ఓటిటీలో ఆర్తి అగర్వాల్ బయోపిక్
ఆర్తి అగర్వాల్ బయోపిక్ పై గత ఏడాది నుంచి చర్చలు జరుగుతున్నాయని రూమర్స్ అయితే గట్టిగానే వచ్చాయి. ఇక ప్రస్తుతం ఓటీటీలోనే కొన్ని ఎపిసోడ్స్ లాగా రిలీజ్ చేస్తే బావుంటుందని ఆలోచిస్తున్నారట. లావు తగ్గడానికి లైపో సర్జరీ చేసుకున్న ఆర్తి అమెరికాలోనే తుది శ్వాసను విడిచిన విషయం తెలిసిందే.
కాస్త తేడా వచ్చినా కష్టమే..
అయితే ఆర్తి అగర్వాల్ జీవితంలో ఎదుర్కొన్న కొన్ని మోసాలను సినిమాలో హైలెట్ గా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇక దాసరి నారాయణరావు బయోపిక్ అనేది చాలా క్లిష్టమైనది. దర్శకరత్న అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి గౌరవమే అలాంటిది ఆయన బయోపిక్ తీయాలి అంటే చాలా బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేయాలి. కాస్త తేడా వచ్చినా కష్టమే.
దాసరి జీవితంలో కష్టాలు
దాసరి విజయాలతో పాటు ఆయన కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న తీరును సినిమాగా చూపించే అవకాశం ఉందట. చాలా ఇంటర్వ్యూలలో దాసరి తన కొడుకుల గురించి చెబుతూ కొంత బాధపడ్డారు. మరి ఆ కాంట్రవర్సీ కాన్సెప్ట్ లను ఎవరు,ఎలా తెరకెక్కిస్తారో చూడాలి.
వర్మ 'హృదయ్ కిరణ్'..
ఇక ఉదయ్ కిరణ్ జీవితంపై సినిమా వస్తుందని చాలా ఏళ్లుగా రూమర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ కూడా ఉదయ్ బయోపిక్ పై దీర్ఘంగా ఆలోచించారనే కామెంట్స్ వచ్చాయి. హృదయ్ కిరణ్ అనే టైటిల్ కూడా సెట్ చేసుకున్నారని కథనాలు వెలువడ్డాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.