బడా రాజకీయ నాయకుల భరతం పట్టనున్న చిరంజీవి.. వెలుగులోకి ఆసక్తికర అంశం

Recommended Video

Chiranjeevi-Koratala Siva Movie Story Line || రాజకీయ నాయకుల భరతం పట్టనున్న చిరంజీవి

ఉయ్యాలవాడ వీరుడిగా బ్రిటిష్ వాళ్లకు చుక్కలు చూపించిన మెగాస్టార్ చిరంజీవి.. ఇక దేశం లోని అవినీతి పరులైన బడా రాజకీయ నాయకుల భరతం పట్టేందుకు సిద్దమవుతున్నారట. ప్రస్తుతం ఈ అంశం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. అంటే చిరంజీవి మళ్ళీ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారా? అనేగా మీ సందేహం. ఆ వివరాలు చూస్తే..

మెగా రీ ఎంట్రీ.. ఆసక్తికర కథాంశాలు

మెగా రీ ఎంట్రీ.. ఆసక్తికర కథాంశాలు

వరుసగా 149 సినిమాలు చేసి అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్న మెగాస్టార్ ఆ తరువాత రాజకీయ బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే అనుకున స్థాయిలో రాజకీయాల్లో ఆదరణ లభించక పోవడంతో తిరిగి వెండితెర పైకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆసక్తికర కథాంశాలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు.

సైరా తర్వాత కొరటాల శివతో

సైరా తర్వాత కొరటాల శివతో

ఇటీవలే సైరా నరసింహా రెడ్డి రూపంలో చారిత్రాక నేపథ్యమున్న సినిమాలో నటించిన చిరు.. ఇటీవలే కొరటాల శివతో తన 152 వ సినిమాను ప్రారంభించారు. సామాజిక అంశాలతో సినిమాలు తెరకెక్కించడంలో కొరటాలను మించిన డైరెక్టర్ టాలీవుడ్ లో లేడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో అదే బాటలో చిరంజీవి కోసం ఆయన ఓ అద్భుతమైన స్టోరీ రెడీ చేశారని తెలుస్తోంది.

దేవాలయాల్లో అవినీతి.. చిరంజీవి పని

దేవాలయాల్లో అవినీతి.. చిరంజీవి పని

రెండు తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలలో జరుగుతున్న అవినీనీతిని కొరటాల టచ్ చేస్తూ ఈ సినిమా స్టోరీ సిద్ధం చేశారని సమాచారం. చిత్రంలో చిరంజీవి దేవాదాయ శాఖ ఉద్యోగిగా నటించనున్నారనేది లేటెస్ట్ టాక్. దేవాదాయ శాఖ ఉద్యోగిగా పలు దేవాలయాల్లో జరుగుతున్న అవినీతిని వెలికితీసే పనిలో నిమగ్నమవుతారట చిరంజీవి.

రాజకీయ నాయకుల భరతం పడుతూ

రాజకీయ నాయకుల భరతం పడుతూ

కొరటాల సిద్ధం చేసిన కథ ప్రకారం.. దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి, కుంభకోణాల్లో రాజకీయ నాయకుల హస్తం ఉంటుందట. సదరు రాజకీయ నాయకుల భరతం పడుతూ దేవాదాయ షాక్ ఉద్యోగిగా చిరంజీవి రోల్ సినిమాలో హైలైట్ అయ్యేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

ఇన్నాళ్లు సైరా కారణంగా.. ఇప్పుడు

ఇన్నాళ్లు సైరా కారణంగా.. ఇప్పుడు

నిజానికి కొరటాల- చిరంజీవి మూవీ ఎప్పుడో ఓకే అయింది. కానీ సైరా సినిమా షూటింగ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పడు సైరా పనులన్నీ ముగియడంతో చిరు ఫ్రీ అయ్యారు. నవంబర్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు మరికొద్ది రోజుల్లోనే ప్రకటించనుంది చిత్రయూనిట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X