చిరు బర్త్ డేకి కష్టమే.. మరో రెండు నెలలు పట్టొచ్చు
ఖైదీ నెంబర్ 150 సినిమాతో చిత్రసీమలోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా నరసింహా రెడ్డి' సినిమా పనులతో బిజీగా ఉన్నారు. మెగా 151 సినిమాగా రాబోతున్న ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. చాలా కాలంగా ఎన్నో అవాంతరాలతో వాయిదా పడుతూ వచ్చిన సైరా షూటింగ్ కంప్లీట్ కావడంతో చిరు- కొరటాల కాంబోలో రానున్న చిరు 152 సినిమా పై అందరి కళ్ళు పడ్డాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి బర్త్ డే కానుకగా ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు చిరంజీవి బర్త్ డే రోజైన ఆగస్టు 22న కొరటాల సినిమా ప్రారంభం కావడం లేదని తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండటమే అంటున్నారు. పైగా ఈ సినిమాపై కొన్ని వివాదాలు రాజుకుంటున్నాయి కాబట్టి ఈ రెండు నెలల సమయం సైరా కోసమే కేటాయించాలని ఫిక్స్ అయ్యారట చిరు. ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళదామని కొరటాలకు సూచించారట చిరు. దీంతో ఈ విషయమై చర్చించుకున్న ఈ ఇద్దరూ అక్టోబర్ నెలలోనే సెట్స్ మీదకు రావాలని డిసైడ్ అయ్యారట. అదే నెలలో (అక్టోబర్ 2 న) సైరా నరసింహా రెడ్డి సినిమా విడుదల కానుంది.

అంటే ఇప్పటికే 'భరత్ అనే నేను' సినిమా తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ తీసుకున్న కొరటాల శివ మరో రెండు నెలలు వెయిట్ చేయక తప్పేలా లేదు. సందేశాత్మక చిత్రాలు రూపొందించడంలో దిట్ట అయిన కొరటాల.. చిరంజీవి సినిమా కోసం మంచి స్క్రిప్ట్ రెడీ చేశారట. నిరుద్యోగం, రైతుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం చిరు ప్రత్యేక కసరత్తులు చేస్తున్నారు. ఇందులో డిఫెరెంట్ లుక్ లో కనిపించాలని బాలీవుడ్ నుంచి వచ్చిన స్పెషల్ ట్రైనర్ సమక్షంలో చిరు కసరత్తులు జరుగుతున్నాయి. ఇక ఈ చిత్ర టైటిల్, చిరు సరసన నటించబోయే హీరోయిన్స్ వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











