సాహోలో ప్రభాస్.. ఆ రెండు పాత్రలు అతనివే.. తెరపైకి ఆసక్తికర అప్‌డేట్

ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానేవచ్చింది. మరో పది రోజుల్లో ప్రభాస్ హీరోగా రూపొందిన మరో భారీ సినిమా సాహో విడుదల కానుంది. ఈ సినిమా పట్ల వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఆతృతగా ఉన్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్రయూనిట్.. సరికొత్త అప్‌డేట్స్ ఇస్తూ సినిమాపై ఉన్న హైప్ రెట్టింపు చేస్తోంది.

ఈ నేపథ్యంలో సాహోలో ప్రభాస్ రోల్‌కి సంబందించిన విషయంపై ఫిలిం నగర్ సర్కిల్స్ లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ రెండు డిఫెరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. దొంగ, పోలీస్ రెండు క్యారెక్టర్లలో ప్రభాస్ కనిపించనున్నాడని అంటున్నారు. ఇటీవలే విడుదలైన సాహో ట్రైలర్‌లో ప్రభాస్ రెండు రకాల గెటప్‌తో కనిపించడం ఈ చర్చలకు బలం చేకూర్చుతోంది. మరో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే.. హీరోయిన్ శ్రద్ద కపూర్ కూడా డ్యూయల్ రోల్ చేస్తోందట. అయితే ఈ ఆసక్తికి తెరపడాలంటే ఆగస్టు 30 వ తేదీ రావాల్సిందే.

 Update On Prabhas Role in Saaho

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది సాహో సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. హీరోయిన్ శ్రద్ద కపూర్‌కి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఇంకా ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X