మహేష్ బాబు-అనిల్ రావిపూడి మూవీ.. నో చెప్పిన ఉపేంద్ర?
'ఎఫ్ 2' విజయం తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి బంపర్ ఛాన్స్ కొట్టేశాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సినిమా చేసే అవకాశం దక్కించుకున్న ఈ యంగ్ డైరెక్టర్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ముఖ్యంగా తారాగణం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు.
ప్రముఖ కన్నడ స్టార్ ఉపేంద్రతో ఈ చిత్రంలో విలన్ రోల్ చేయించాలని భావించిన అనిల్.. ఇటీవల అతడితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్ ఉపేంద్ర సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

ఉపేంద్ర నో చెప్పడానికి కారణం ఏమిటి?
ఉపేంద్ర కొన్ని రోజుల క్రితమే ‘ప్రజాకీయ పార్టీ' అనే పొలిటికల్ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిదే. లోక్ సభ ఎన్నిక నేపథ్యంలో ఇందుకు సంబంధించిన వ్యవహారాల్లోనే బిజీగా ఉన్నట్లు సమాచారం. అందుకే ఆయన ఈ ఆఫర్ తిరస్కరించినట్లు తెలుస్తోంది.

అనేక రూమర్స్
మహేష్ బాబు-అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ఇంకా అఫీషియల్‌గా లాంచ్ కానప్పటికీ రూమర్స్ మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించగా ఆమె ఆఫర్ రిజక్ట్ చేసినట్లు ప్రచారం జరుగింది. దీంతో రష్మిక మందన్న ఆ ఛాన్స్ దక్కించుకున్నట్లు టాక్.

విజయ్ సేతుపతితో సంప్రదింపులు
విలన్ పాత్ర చేయడానికి ఉపేంద్ర నో చెప్పడంతో... తమిళ స్టార్ విజయ్ సేతుపతితో సంప్రదింపులు జరుపుతున్నారట. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. అన్నీ సెట్టయిన తర్వాతే నిర్మాత అనిల్ సుంకర అఫీషియల్‌గా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయనున్నారు.

మహర్షి
ప్రస్తుతం మహేష్ బాబు ‘మహర్షి' చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. సూపర్ కెరీర్లో 25వ ల్యాండ్ మార్క్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్, దిల్ రాజు, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











