మహేశ్ తండ్రిగా స్టార్ హీరో: ఇద్దరికీ ఏడేళ్లే తేడా.. త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నాడంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా వరుస సినిమాలతో సందడి చేస్తూ.. ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటూ హవాను చూపిస్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అతడు అదిరిపోయే ఫామ్‌తో కనిపిస్తున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే అతడు 'సర్కారు వారి పాట' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. త్వరలోనే అతడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఇందులో మహేశ్ బాబు తండ్రిగా స్టార్ హీరో నటిస్తున్నట్లు ఓ న్యూస్ లీకైంది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్
ఆ మధ్య భారీ డిజాస్టర్లతో ఇబ్బంది పడ్డ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఇటీవలి కాలంలో డూపర్ ఫామ్‌తో దూసుకెళ్తున్నాడు. కొరటాల శివతో చేసిన 'భరత్ అనే నేను' నుంచి వరుసగా 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో హ్యాట్రిక్‌ను కూడా అందుకున్నాడు. అలాగే ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేసుకున్నాడు.

సర్కారు వారి పాట అంతంతగా
స్టార్ హీరో మహేశ్ బాబు ఇటీవలే పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేశాడు. ఈ మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. దీనికి థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా టార్గెట్‌ను చేరకుండా అంతంతగానే రాణించింది.

త్రివిక్రమ్‌తో మహేశ్ బాబు ఫిల్మ్
వరుస హిట్లతో జోష్‌లో ఉన్న మహేశ్ బాబు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే అతడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. దీనిపై భారీ అంచనాలున్నాయి.

సినిమా షూట్‌కు సర్వం సిద్ధం
త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేశ్ బాబు చేయాల్సిన సినిమా ఎప్పుడో మొదలు కావాల్సి ఉంది. కానీ, సర్కారు వారి పాట షూటింగ్ ఆలస్యం అవడంతో ఇది పట్టాలెక్కలేదు. ఇంతలో కొద్ది రోజుల క్రితమే మహేశ్ బాబు మోకాలికి సర్జరీ జరిగింది. ఆ తర్వాత అతడికి కరోనా వైరస్ కూడా సోకింది. అలాగే, ఫారెన్ ట్రిప్ వెళ్లి వచ్చాడు. దీంతో ఈ సినిమా జూలై నుంచి ప్రారంభం కాబోతుందట.

నటుల ఎంపికపై గురూజీ ఫోకస్
మహేశ్ బాబుతో చేయబోయే సినిమా విషయంలో త్రివిక్రమ్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాడు. ఈ మూవీ కోసం గురూజీ ఇప్పటికే డైలాగ్ వెర్షన్‌తో కూడిన ఫుల్ స్క్రిప్టును రెడీ చేసేశాడని ఎప్పుడో న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, థమన్ కూడా కొన్ని పాటలు రెడీ చేశాడట. మొత్తంగా ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి.. ఇప్పుడు నటుల ఎంపిక కూడా తుది దశకు చేరిందని టాక్.

మహేశ్ బాబు తండ్రిగా ఈ హీరో
దాదాపు 11 ఏళ్ల తర్వాత తివిక్రమ్ - మహేశ్ బాబు కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో భాగం కాబోయే నటీనటుల గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో మహేశ్ బాబు తండ్రిగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటిస్తున్నట్లు తెలిసింది.

ఏజ్ గ్యాప్ లేకున్నా.. అలా ప్లాన్
సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రంలో ఉపేంద్ర హీరో తండ్రిగా చేస్తున్నాడట. అయితే, వీళ్లిద్దరికీ కాంబినేషన్ సీన్స్ ఉండవని తెలుస్తోంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లోనే ఉపేంద్ర సీన్స్ వస్తాయట. అందుకే మహేశ్‌తో ఏజ్‌లో ఏంతో తేడా లేకపోయినా తండ్రిగా అతడిని ఎంపిక చేసుకున్నారట. త్వరలోనే అతడి పేరును ప్రకటించబోతున్నారట.


Click it and Unblock the Notifications











