ఎన్టీఆర్ కోసం ఎదురుచూడలేక.. మెగా హీరో కోసం వెళుతున్న ఉప్పెన దర్శకుడు
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో ఉప్పెన టాప్ లిస్ట్ లో ఉంటుంది. పెట్టిన పెట్టుబడులకు సినిమా అనుకున్నట్లుగానే దాదాపు 100కోట్ల వరకు బిజినెస్ చేసింది. దీంతో దర్శకుడు బుచ్చిబాబుకి ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఎన్టీఆర్ తో చర్చలు జరిపారు గాని అది ఎటు తేలలేదు. ఇక ఫైనల్ గా దర్శకుడు మళ్ళీ మెగా కాంపౌండ్ వైపే యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది.

ఆర్య 2 నుంచి..
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఆర్య 2 నుంచి సినిమా ఇండస్ట్రీలో తన గురువు వద్దే ఉంటున్నాడు. మొదటి నుంచి కూడా సుక్కు సినిమాల్లో రైటర్ గా వర్క్ చేస్తూ వస్తున్నాడు. వీలైనంత వరకు తన ప్రమేయం ఉండేలా చూసుకున్నాడు. ఇక చాలామంది హీరోలు నిర్మాతలు అతని టాలెంట్ ను గుర్తించారు కూడా.

మొదటి అవకాశం ఇచ్చిన కృతజ్ఞతతో
రంగస్థలం సినిమా విషయంలో కూడా బుచ్చిబాబు చాలా వాటిల్లో హెల్ప్ చేసినట్లు సుకుమార్ ఓపెన్ గానే చెప్పేశాడు. ఇక ప్రస్తుతం అతనికి ఆఫర్స్ గట్టిగానే వస్తున్నా కూడా మైత్రి మూవీ మేకర్స్ మొదటి అవకాశం ఇచ్చిన కృతజ్ఞతతో అదే ప్రొడక్షన్ లో వర్క్ చేసేందుకు సిద్ధం అయ్యాడు. అయితే అతని ప్లాన్స్ అనుకున్నట్లుగా వర్కౌట్ అవ్వడం లేదు.

ఎన్టీఆర్ ఆలోచన మారిందా?
ఉప్పెన సక్సెస్ కంటే ముందే ఎన్టీఆర్ కు కథను చెప్పే అవకాశం దక్కించుకున్న బుచ్చిబాబు RRR అనంతరం ఎన్టీఆర్ ఆలోచనలు మారిపోతాయని ఊహించలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్ట్ తో పాటు ప్రశాంత్ నీల్ తో కమిట్మెంట్ తీసుకున్నాడు. ఈ ప్రాజెక్టులకు మూడేళ్ళ సమయం పట్టవచ్చు. సో గ్యాప్ లేదు.

మళ్ళీ వైష్ణవ్ తేజ్ తోనే..?
ఇక ఇప్పటికే ఉప్పెన అనంతరం చాలా గ్యాప్ తీసుకున్న బుచ్చిబాబు అడ్వాన్స్ గా కథలను అయితే రెడీ చేసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ తో లోకల్ కథను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలని అనుకున్నాడు కానీ వర్కౌట్ కాలేదు. ఎన్టీఆర్ అంతగా ఆసక్తి చూపలేదని కూడా టాక్ వస్తోంది. దీంతో బుచ్చిబాబు మళ్ళీ వైష్ణవ్ తేజ్ తోనే వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓకేవేళ ప్రాజెక్ట్ సెట్టయితే ఉప్పెన కాంబో అంటూ బజ్ క్రియేట్ అవ్వడం పక్కా. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications










