ఉప్పెన దర్శకుడి మరో షాకింగ్ నిర్ణయం.. మరో కొత్త హీరోతో..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం భారీ డిమాండ్ ఉన్న దర్శకుల్లో బుచ్చిబాబు ఒకరు. ఉప్పెన సినిమాతో నిజంగానే సుకుమార్ శిష్యుడు అనిపించుకున్నాడు. ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోవడంతో వారికి అవకాశాలు కూడా నాన్ స్టాప్ గా వస్తున్నాయి. ఇక బుచ్చిబాబు ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అసలైతే ఈ దర్శకుడు తన తరువాత సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కు ముందే ఒక లైన్ చెప్పేసి స్క్రిప్ట్ రేడి చేసే పనిలో బిజీ అయ్యాడు. అయితే ఎన్టీఆర్ RRR తరువాత కొరటాల శివ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత రేంజ్ ను బట్టి ఎలాంటి సినిమా చేస్తాడో తెలియదు. పైగా కరోనా వల్ల ఇప్పట్లో ఎన్టీఆర్ దొరకడం కష్టమే.

ఇక బుచ్చిబాబు ఆ కన్ఫ్యూజన్ తో ఎన్టిఆర్ స్క్రిప్ట్ ను ప్రస్తుతానికి పక్కన పెట్టేసినట్లు టాక్ అయితే వస్తోంది. ఎక్కువ రోజులు గ్యాప్ ఇవ్వకూడదని మరొక లవ్ స్టోరీతో రావాలని ఫిక్స్ అయ్యాడు. ఎవరో ఒక కొత్త హీరోను పరిచయం చేయబోతున్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ బుచ్చిబాబుతో రెండు సినిమాలకు అగ్రిమెంట్ సెట్ చేసుకుంది. అలాగే బయట ప్రొడక్షన్ ల నుంచి కూడా ఆఫర్స్ బాగానే వస్తున్నాయట. మరి బుచ్చిబాబు నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











