ఆ స్టార్ హీరోను వదలని ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు.. సెట్టయ్యింది కానీ..?
ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. సుకుమార్ శిష్యుడిగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ఈ టాలెంటెడ్ దర్శకుడు తన తరువాత సినిమాను కూడా మైత్రి మూవీ మేకర్స్ తోనే చేయబోతున్నాడు. నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చేసి కమిట్మెంట్ కూడా తీసుకున్నారు.
ఇక బుచ్చిబాబు టార్గెట్ అయితే చిన్నగా లేదు. మొదటి సినిమా విషయంలోనే చాలా రిస్కీ కంటెంట్ ను ఎంచుకున్నాడు. ఇక రెండవ సినిమా విషయంలో ఎవరు ఊహించని విధంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. గత కొన్ని రోజుల క్రితం అయితే స్పోర్క్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నట్లు టాక్ వచ్చింది. అఫీషియల్ గా అయితే ఇంకా ఎలాంటి క్లారితో రాలేదు.

అయితే స్టార్ హీరోలలో మొదట బుచ్చిబాబు జూనియర్ ఎన్టీఆర్ ను టచ్ చేయవచ్చని తెలుస్తోంది. అయితే దానికి చాలా టైమ్ ఉంది. ఎన్టీఆర్ 30వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ఇక 31వ సినిమాను ప్రశాంత్ నీల్, 32వ సినిమాను అట్లీతో చేయవచ్చని టాక్. అలాగే మరో బాలీవుడ్ దర్శకుడితో కూడా సినిమా చేయవచ్చని సమాచారం. ఫైనల్ గా 34వ సినిమాను బుచ్చిబాబుతో చేస్తారని టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











