మరో బంపర్ ఆఫర్ అందుకున్న ఉప్పెన బ్యూటీ
ఉప్పెన సినిమాలో బెబమ్మా అనే పాత్రలో నటించిన బ్యూటీఫుల్ హీరోయిన్ కృతి శెట్టి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ మొదటి చూపులోనే కుర్రాళ్లను గట్టిగానే ఎట్రాక్ట్ చేసింది. ఇక సినిమా చూస్తున్నంత సేపు ఎక్కువగా కృతి తన అందం నతనతో మిగతా వారిని డామినేట్ చేసిందనే కామెంట్స్ అందుకుంటోంది. అయితే ఇప్పటికే అమ్మడు రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నెక్స్ట్ నాని శ్యామ్ సింఘరాయ్ సినిమాతో రాబోతున్న కృతి ఆ తరువాత శర్వానంద్ తో కూడా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతోంది. ఎక్కువగా గ్లామర్ టచ్ ఇవ్వకుండా కేవలం తనకు నచ్చిన పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ బ్యూటీ మరో బిగ్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. రామ్ పోతినేని లింగుస్వామి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది.

రెడ్ లాంటి డీసెంట్ హిట్ అనంతరం రామ్ చేస్తున్న ఈ ద్విభాషా సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారట. ఇక ఉప్పెనతో అలా హిట్ అందుకుందో లేదో ఆమెపై ఫోకస్ పెట్టారు. ఇక గ్యాప్ లేకుండా ఆఫర్స్ వస్తుండడంతో కృతి ఏ మాత్రం తొందరపడకుండా నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలను మాత్రమే ఒకే చేస్తోంది. వీలైనంత వరకు కమర్షియల్ సినిమాలకు దూరం పెడుతున్నట్లు టాక్ వస్తోంది. ఇక రామ్ లింగుస్వామి సినిమా అమ్మడికి ఎలాంటి క్రేజ్ అందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











