అగ్ర హీరోయిన్స్ కు షాక్ ఇవ్వబోతున్న ఉప్పెన బ్యూటీ.. ఆ ప్లాన్ వర్కౌట్ అయితే తిరుగుండదు!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం తరువాత ఒక హీరోయిన్ మెల్లగా తన క్రేజ్ పెంచుకుంటోంది. మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని ఇప్పుడు మీడియం హీరోలతో కూడా జత కడుతోంది. ఆ బ్యూటీ మరెవరో కాదు. ఉప్పెన సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన కృతి శెట్టి. ఇక భవిష్యత్తులో అమ్మడికి మరిన్ని మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల అగ్ర హీరోయిన్స్ కు పోటీ ఇచ్చేలా ఒక ప్రయోగానికి సిద్ధమైనట్లు సమాచారం.

చాలా వేగంగా..

చాలా వేగంగా..

సమంత, కాజల్, తమన్నా మొన్నటి వరకు పెద్ద సినిమాలతో డామినేషన్ చేశారు. ఇక వారి తరువాత పూజా హెగ్డే, రష్మీక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో మరింతగా డామినేట్ చేస్తున్నారు. ఇక కొత్తగా వచ్చిన బ్యూటీలకు పెద్దగా అవకశాలు రావడం లేదు. కానీ ఉప్పెన సినిమాతో వెండితెరకు పరిచయం అయిన కృతి శెట్టి మాత్రం చాలా వేగంగా పెద్ద సినిమాల్లో ఛాన్స్ అందుకుంటోంది.

లక్కుతో వచ్చిన ఆఫర్

లక్కుతో వచ్చిన ఆఫర్

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమాలో మొదట వేరే హీరోయిన్ ను అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తూ ఆ ఆఫర్ కృతి శెట్టికి దక్కింది. ఇక అలా ఆఫర్ వచ్చి రాగానే అమ్మడు చాలా తొందరగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఉప్పెన విడుదలకు ముందే శ్యామ్ సింగరాయ్ లో నానితో మంచి ఆఫర్ కూడా అందుకుంది.

బిజీబిజీగా...

బిజీబిజీగా...

ఇక ప్రస్తుతం రామ్ ద్విభాషా సినిమాలో కూడా మేయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా సుధీర్ బాబు - మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో రూపొందుతున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాలో కూడా మేయిన్ హీరోయిన్ గా దర్శనమివ్వనుంది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతుందని నమ్మకంతో ఉందట.

 తమిళంలో కూడా..

తమిళంలో కూడా..

కృతి శెట్టి చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలన్ని కూడా చాలా మంచి సినిమాలని చెప్పవచ్చు. అంతే కాకుండా ఇటీవల ఈ బ్యూటీ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేయడానికి కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా కృతి స్థాయిని పెంచే విధంగా ఉంటుందట. ఒకవేళ ప్రాజెక్టు అనుకున్నట్టుగా సెట్టయితే తమిళంలో కూడా ఒకేసారి విడుదల చేయాలని చూస్తున్నారు.

Recommended Video

Shyam Singha Roy : Turning Point For Telugu Cinema - Satyadev Janga | Nani
ఆ ప్రాజెక్ట్ సెట్టయితే..

ఆ ప్రాజెక్ట్ సెట్టయితే..

ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒక సీనియర్ దర్శకుడు సీనియర్ నిర్మాత రెగ్యులర్ గా కృతి శెట్టి తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే గనుక కృతి శెట్టి తప్పకుండా సౌత్ ఇండస్ట్రీ లో అగ్రహీరోయిన్స్ కి పోటీగా నిలుస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ప్రస్తుతం కృతి శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. నాని ద్విపాత్రాభినయం చేసిన ఆ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X