twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుకుమార్‌తో ఛాన్స్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన 'ఉప్పెన' బ్యూటీ!

    |

    సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవ్వరికి ఎలాంటి అవకాశాలు తలుపుతాడతాయో ఎవ్వరూ ఊహించలేరు. అది అదృష్టమో.. లేక ఎంటరైన టైమ్ ఎలాంటిదో తెలియదు కానీ కొందరు హీరోయిన్స్ అనుకోకుండా వరుస అవకాశాలు పట్టేస్తుంటారు. తాజాగా అదే ఫార్ములా అప్లై అవుతోంది యంగ్ హీరోయిన్ క్రితి శెట్టికి.

    మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ఉప్పెన సినిమాలో క్రితి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేయడమే గాక.. హీరోహీరోయిన్లకు మంచి గుర్తింపునిచ్చాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావించారు. కానీ ఇప్పుడు క‌రోనా వైర‌స్ ప్ర‌భావం కార‌ణంతో విడుదల వాయిదా వేయలేక తప్పలేదు. అతి త్వరలో ఈ మూవీ కొత్త విడుదల తేదీ ప్రకటించనున్నారు.

     Uppena heroine Krithi Shetty offer with Sukumar?

    అయితే ఇదిలా ఉండగానే.. హీరోయిన్ క్రితి శెట్టి మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. 'ఉప్పెన‌' నిర్మాత‌ల్లో ఒక‌రైన సుకుమార్ ఇప్పుడు క్రితి శెట్టికి మ‌రో అవకాశాన్ని ఇచ్చార‌ని టాక్ నడుస్తోంది. సుకుమార్ రైటింగ్స్‌, జీఏ 2 పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై తెరకెక్కనున్న '18 పేజీస్‌' చిత్రంలో క్రితి శెట్టిని హీరోయిన్‌గా తీసుకోవాల‌నుకుంటున్నార‌ట‌.

    బ‌న్నీవాసు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సినిమాకు ప‌ల్నాటి సూర్య ప్రతాప్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా, నిఖిల్ హీరోగా న‌టిస్తున్నాడు. ఇదే నిజమైతే ఇక తెలుగు తెరపై మరో అందం హంగామా మొదలైనట్లే మరి.

    English summary
    Krithi Shetty is an Indian film actress appearing in Tamil, Kannada and Telugu films. Her latest movie Uppena with Vaishnav Tej Movie. Now she got lucky chance with Sukumar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X