నష్టపోయినా పరవాలేదు.. మెగా హీరో కోసం నిర్మాతల కఠిన నిర్ణయం
కరోనా దెబ్బకు సినిమా ఇండస్ట్రీలో కొందరికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. సినిమాను పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేసిన సమయంలో ఉహీంచని విధంగా కరోనా వైరస్ అడ్డుకట్ట వేయడం అందరిని షాక్ కి గురి చేసింది. ఇక కొందరు నష్టాల నుంచి తప్పించుకోవడానికి డైరెక్ట్ గా ఓటీటీ లోనే రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఉప్పెన సినిమాకు కూడా పలు ఓటీటీ సంస్థల నుంచి భారీ ఆఫర్స్ వచ్చయట.
కానీ యువ హీరో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రిస్క్ చేయాలని అనుకోవడం లేదట. అలాగే సినిమా థియేటర్స్ లోకి వస్తే లాభాలు ఎక్కువగా ఉంటాయని నమ్మకంతో ఉన్నారట. ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం కానున్న వైష్ణవ్ తేజ్ ఈ సమ్మర్ లోనే థియేటర్స్ లో సందడి చేయాలని అనుకున్నాడు. కానీ కరోనా కారణంగా కన్ఫ్యూజన్ లో పడ్డాడు. థియేటర్స్ అయితే ఇప్పట్లో ఓపెన్ చేస్తారనే నమ్మకం లేదు.

సినిమా హాళ్లు తెరిచినా కూడా జనాలు వస్తారనే గ్యారెంటీ లేదు. దీంతో కొన్ని సినిమాలను ఓటీటీ సంస్థలు టార్గెట్ చేస్తున్నాయి. వీలైనంత ఎక్కువ ఎమౌంట్ ని ఇచ్చి సినిమాలను దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇక ఉప్పెన నిర్మాతలకు మూడు సంస్థలు మంచి ఎమౌంట్ తో ఆఫర్ చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. నష్టపోయిన పరవాలేదు అంటూ నిర్మాతలు డైరెక్ట్ గా థియేటర్స్ లోనే సినిమాను రిలీజ్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











