ఉప్పెన సినిమాకు 18కోట్ల ఆఫర్.. కానీ అప్పటికే చేయి దాటిపోయింది!
మెగాఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయం కాబోతున్న మరొక హీరో వైష్ణవ్ తేజ్. ఈ సినిమాపై మెగా అభిమానుల్లోనే కాకుండా ఇతర సినీ లవర్స్ లో కూడా అంచనాలు భారిగానే పెరుగుతున్నాయి. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక్క సాంగ్ తోనే దేవిశ్రీప్రసాద్ పవర్ఫుల్ బజ్ క్రియేట్ చేశాడు.
ఆ ఒక్క పాటతోనే ఉప్పెనలా అంచనాలు పెరిగిపోయాయి.
అందుకే సినిమా బిజినెస్ పై కూడా అంచనాల డోస్ పెరిగాయి. అసలు మ్యాటర్ లోకి వెళితే.. సినిమాకు సంబంధించిన ఒక గోల్డెన్ ఆఫర్ ను నిర్మాతలు వదులుకోవాల్సి వచ్చిందట. సినిమా అవుట్ రేట్, రెండు రాష్ట్రాల థియేటర్ హక్కులను 18కోట్లకు అమ్మే ఛాన్స్ వచ్చిందట. చిత్ర నిర్మాతల్లో ఒకరైన సుకుమార్ కు ఒక బయ్యర్ ఈ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అప్పటికే బిజినెస్ డీల్స్ చాలా వరకు క్లోజ్ అయ్యాయట.

ముఖ్యంగా నైజాం హక్కులను నాలుగున్నర కోట్లకు సీనియర్ నిర్మాత దిల్ రాజుకు అమ్మేశారని తెలుస్తోంది. అలాగే మిగతా ఏరియాల హక్కులు కూడా మంచి రేటుకే అమ్మరట. అందుకే ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఇక సినిమా ఫిబ్రవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఓటీటీలో ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేయడానికి ఒప్పుకోలేదు. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా కావడంతో ఎలాగైనా థియేటర్స్ లోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక సంక్రాంతి రావాలని అనుకున్నారు గాని థియేటర్స్ కు 100% ఆక్యుపెన్సీతో నడిచే వరకు విడుదల చేయకూడదని మళ్ళీ వెనక్కి తగ్గారు.


Click it and Unblock the Notifications











