ఆ బ్యూటీ రేటుకు బయపడిన బన్నీ, గోపిచంద్.. దెబ్బకు దండం పెట్టేశారు..
టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తే నటించాలని బాలీవుడ్ హీరోయిన్స్ ఈ మధ్య టాలీవుడ్ పై కాస్త స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఒకప్పుడు టాలీవుడ్న్ చేస్తే రేంజ్ తగ్గుతూ అనే అపోహలు బాలీవుడ్ లో గట్టిగా ఉండేవి. కానీ ఇపుడు మాత్రం రెమ్యునరేషన్ స్ట్రాంగ్ గా ఇస్తే ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధం అంటున్నారు. ఇకపోతే ఇటీవల ఒక బ్యూటీ కోసం టార్గెట్ చేసిన మన హీరోలు దెబ్బకు భయపడి దండం పెట్టేశారట. ఎందుకంటే ఆమె అడిగిన రెమ్యునరేషన్ వారికి దిమ్మతిరిగేలా చేసిందట.

కీయరా అద్వానీ ఎంట్రీతో..
కీయరా అద్వానీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ అందుకోవడమే కాకుండా బాలీవుడ్ సైడ్ కూడా ఎప్పటిలానే అదే రేంజ్ లో ఆఫర్స్ అందుకుంటోంది. అదే విషయాన్ని గమనించిన నార్త్ బ్యూటీలు ఈ మధ్య తెలుగు నుంచి ఎలాంటి ఆఫర్స్ వచ్చినా నో చెప్పకుండా కథకు వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.

ఊర్వశి రౌతేలా..
ఈ మధ్య హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా అదే తరహాలో గోపిచంద్, అల్లు అర్జున్ ప్రాజెక్ట్ లకు సంబంధించిన ఆఫర్స్ అందుకుందట. ఎప్పుడైనా సరే రెమ్యునరేషన్ విషయంలో చర్చలు జరగడం కామన్. అడిగినంత ఇవ్వడానికి కొంతమంది నిర్మాతలు రెడీగా ఉండరు. ఇక ఊర్వశి కూడా ఇటీవల రెమ్యునరేషన్ గురించి తరువాత మాట్లాడుకుందామని ముందయితే సినిమాల గురించి చర్చిందట.

ఇద్దరికి షాకిచ్చిందట..
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా పుష్పలో ఒక స్పెషల్ సాంగ్ కోసం ఈ బ్యూటీని సంప్రదించారట. ఇక గోపిచంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సీటిమార్ సినిమాలో అయితే కథను మలువు తిప్పే రోల్ కోసం అడిగారట. గత వారం రోజుల నుంచి ఈ రేండు ప్రాజెక్టుల గురించి చర్చలు జరిపిన ఊర్వశి ఇద్దరికి ఒకే రేటుతో షాకిచ్చిందట.
Recommended Video

కుదరదని చెప్పేశారట..
ప్రస్తుతం బాలీవుడ్ లో ఆమె రేంజ్ గట్టిగానే ఉన్నప్పటికీ ఊహించని విధంగా టాలీవుడ్ సినిమాలకు కూడా అదే రేంజ్ లో రెమ్యునరేషన్ అడిగిందట. కోటికి పైగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఎదో అరకోటి వరకు మ్యానేజ్ చేద్దామని అనుకున్న ఇద్దరు హీరోల నిర్మాతలకు అమ్మడు మళ్ళీ మాట్లాడలేని విధంగా డబుల్ రేట్ చెప్పడంతో దండం పెట్టేసి కుదరదని అన్నారట. ఆ విదంగా ఊర్వశి మంచి ఆఫర్స్ ని వదిలేసుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











