Guntur karam: మహేశ్ మూవీలో రిషబ్ పంత్ లవర్.. అంత ఖర్చు చేసి మరీ!
టాలీవుడ్‌లోని చాలా మంది హీరోలు పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటాలని పరితపిస్తున్నారు. కానీ, కొందరు మాత్రం రీజినల్ రేంజ్‌లో తమ స్టామినాను పెంచుకుంటున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే అతడు.. వరుస సినిమాలతో వస్తూ ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం నటిస్తోన్న సినిమానే 'గుంటూరు కారం'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో చెప్పనవసరం లేదు. అంతలా ఇది ఆరంభం నుంచే హైప్‌ను పెంచుకుంటూ వెళ్తోంది. అందుకు అనుగుణంగా చిత్ర యూనిట్ కూడా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది.

దాదాపు 13 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. అయితే, మధ్యలో కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురు కావడంతో షూటింగ్ సజావుగా సాగట్లేదు. కానీ, ఇప్పుడు మాత్రం ఈ మూవీ షూట్ శరవేగంగా జరుగుతూ 70 శాతానికి పైగానే టాకీ పార్ట్ పూర్తైంది.
మహేశ్ బాబు కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'గుంటూరు కారం' మూవీకి సంబంధించి ఎన్నో రకాల అంశాలు లీక్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్ గురించి న్యూస్ ఇటీవలే రివీల్ అయింది. దీని ప్రకారం.. ఈ చిత్రంలో మాంచి మాస్ నెంబర్ ఉన్న ఐటెం సాంగ్‌ను పెట్టారని, దీనికి థమన్ ఇప్పటికే ట్యూన్ రెడీ చేశారని అంటున్నారు.

'గుంటూరు కారం' మూవీలోని స్పెషల్ సాంగ్‌లో ఓ స్టార్ హీరోయిన్‌ను చూపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. మాజీ మిస్ ఇండియా ఊర్వశీ రౌటేలా ఈ మూవీలో సాంగ్ చేస్తుందట. ఇందుకోసం ఆమెకు ఏకంగా రూ. కోటి రెమ్యూనరేషన్‌గా ఇస్తున్నట్లు తెలిసింది. గతంలో ఊర్వశి 'వాల్తేరు వీరయ్య', 'స్కంద'లో స్పెషల్ సాంగ్స్ చేసింది.
ఇదిలా ఉండగా.. 'గుంటూరు కారం' మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అవనుంది.


Click it and Unblock the Notifications











