twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Waltair Veerayya: చిరంజీవి కోసం హాట్ బ్యూటీ.. 4 నిమిషాలకే కోటి రూపాయలా!

    |

    స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, గ్రేస్‌తో ప్రేక్షకులను అలరిస్తూ.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. రాజకీయాల కోసం గ్యాప్ తీసుకున్న ఆయన.. 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి మరింత ఉత్సాహంగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నారు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలతో వచ్చిన చిరంజీవి.. ఇటీవలే 'గాడ్ ఫాదర్' అనే సినిమాను అందించారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ మంచి ఫలితాన్నే రాబట్టిందని చెప్పొచ్చు.

    బాత్రూంలో హాట్‌గా మెగా హీరోయిన్: ఆ డ్రెస్సు.. ఆమె ఫోజు చూశారంటే!బాత్రూంలో హాట్‌గా మెగా హీరోయిన్: ఆ డ్రెస్సు.. ఆమె ఫోజు చూశారంటే!

    ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే మరో రెండు ప్రాజెక్టులను కూడా పట్టాలెక్కించారు. అందులో ఆయన 154వ సినిమాగా వస్తున్న 'వాల్తేరు వీరయ్య' ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ దాదాపుగా పూర్తైపోయింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన డబ్బింగ్ వర్క్‌తో పాటు కొన్ని కీలకమైన పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాను నుంచి ఓ టెర్రిఫిక్ న్యూస్ లీకైంది.

     Urvashi Rautela Special Song in Waltair Veerayya Movie

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' మూవీలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్‌ను పెడుతున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఓ బాలీవుడ్ బ్యూటీ కనిపించబోతుందని కూడా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే తాజాగా దీని గురించి ఓ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ సినిమాలోని ఐటెం సాంగ్ కోసం ఊర్వశి రౌటేలాను తీసుకున్నారట. 4 నిమిషాలు మాత్రమే ఉండే ఈ పాట కోసం ఆమె ఏకంగా రూ. 50 లక్షలు చార్జ్ చేసిందని తెలుస్తోంది. అలాగే, మొత్తంగా ఈ సాంగ్‌ కోసం సెట్‌తో కలిపి రూ. కోటి కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని సమాచారం.

    Poorna Marriage Gift: పూర్ణకు భర్త పెళ్లి కానుక.. బంగారంతో పాటు లగ్జరీ హౌస్.. వాటి ధర ఎంతో తెలిస్తే!Poorna Marriage Gift: పూర్ణకు భర్త పెళ్లి కానుక.. బంగారంతో పాటు లగ్జరీ హౌస్.. వాటి ధర ఎంతో తెలిస్తే!

    చిరంజీవి - బాబీ కాంబోలో రాబోయే 'వాల్తేరు వీరయ్య' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ కూడా ఈ మూవీలో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది.

    English summary
    Megastar Chiranjeevi Now Doing Waltair Veerayya Movie Under K. S. Ravindra Direction. Urvashi Rautela Doing Special Song in This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X