జూ. ఎన్టీఆర్ కండల కోసం US దంపతుల కృషి
హైదరాబాద్ : ఎన్టీఆర్ తన శరీరంపై పూర్తి స్ధాయి దృష్టి పెట్టారని..రామయ్య వస్తావయ్యా చిత్రం చూసిన వారికి అర్దమవుతుంది. ఆయన తన తాజా చిత్రం జోరు కోసం మరింత స్మార్ట్ గా తయారవుతున్నారు. ఇందుకోసం రోజులు నాలుగు గంటలకు పైగా కృషి చేస్తున్నారు. గత పది నెలలుగా..ఫ్లోరిడా బేసెడ్ ఫిటెనెస్ ట్రైనర్స్...జాన్ మరియు అతని భార్య అంబర్ షుమేట్ పర్యవేక్షణలో చేస్తున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ ..జోరు చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత నటిస్తోంది. ఈ సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్నాయి. 'జోరు' అనే టైటిల్ ని పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈచిత్రాన్ని బెల్లంకొండ సురేష్ సమర్పణలో శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్నారు.
సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... మాస్ సినిమాలు చూస్తూ పెరిగినవాణ్ని నేను. నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటివే తీస్తాను. ఎన్టీఆర్ అనగానే శక్తివంతమైన సంభాషణలే గుర్తుకొస్తాయి. అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో మాటలుంటాయి. ఎన్టీఆర్ కథ వినగానే నన్ను ప్రోత్సహించారు. నా తొలి చిత్రంలో హీరో ఎలాంటి బాధ్యత లేకుండా కనిపిస్తారు. కానీ ఇందులో హీరో పాత్రకి ఓ పెద్ద బాధ్యత ఉంటుంది. అది ఏమిటన్నది మాత్రం ఆసక్తికరం. ఇందులో సమంత పాత్ర కూడా కీలకమే'' అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో ప్లేబోయ్ గా కనపడతాడు అని చెప్తున్నారు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.
ఇక... ఇంకో నాలుగైదు సినిమాల తర్వాత కానీ ఎన్టీఆర్‌తో పనిచేసే అవకాశం రాదేమో అనుకొన్నాను. కానీ రెండో ప్రయత్నంలోనే ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. అంతకంటే ఓ గొప్ప బాధ్యత నా భుజాన వేసుకొన్నానన్న ఆనందం కలుగుతోంది అన్నారు.ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం. మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు వినోదం, కుటుంబ అనుబంధాలకి ప్రాధాన్యమిస్తూ కథను రాశా. ఎన్టీఆర్ తెరపై మూడు కోణాల్లో సాగే పాత్రలో నటించబోతున్నారు. ఓ ప్లేబాయ్ తరహాలో ఆయన పండించే వినోదం యువతరాన్ని అలరిస్తుంది. ప్రతీ అభిమాని గర్వపడేలా ఉంటుందీ చిత్రం అన్నారు.
ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












