Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకోకపోయినా, పాజిటివ్ రివ్యూలతో బాక్సాఫీస్ ప్రయాణాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌గా నిలిచిందని చెప్పాలి. అయితే.. ఈ పవర్ స్టార్ మూవీ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లు థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చాలా కాలం తర్వాత పవన్‌ను మాస్, కామెడీ మిక్స్‌లో చూడటం అభిమానులకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్-హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను పూర్తిగా అందుకోకపోయినా, అభిమానులను మాత్రం ఈ సినిమా సంతృప్తిపరిచింది.

Ustaad Bhagat Singh Pooja Hegde Rejected Pawan Kalyan Film Sreeleela Steals the Show

హీరోయిన్ల విషయానికి వస్తే.. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా నటించినప్పటికీ, కథలో ప్రధానంగా శ్రీలీల పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం లభించింది. 'లీల' అనే రేడియో జాకీ పాత్రలో ఆమె తన అందం,అభిమానం, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథ మొత్తం ఆమె చుట్టూ తిరగడం, పవన్-శ్రీలీల మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 'ఈ మనసే' పాట రీమిక్స్ కూడా ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా నిలిచింది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మొదటగా శ్రీలీలను కాకుండా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను ఎంపిక చేయాలని దర్శకుడు హరీష్ శంకర్ భావించారట. గతంలో 'డీజే' సినిమాలో హరీష్ శంకర్-పూజా హెగ్డే కాంబినేషన్ సక్సెస్ కావడంతో, మళ్లీ అదే కాంబినేషన్‌ను రిపీట్ చేయాలని ప్లాన్ చేశారట. కానీ, ఆ సమయంలో పూజా హెగ్డే ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సినిమాను చేయలేకపోయిందని తెలుస్తోంది. దీంతో ఆ అవకాశం యువ హీరోయిన్ శ్రీలీలకు దక్కింది. ఈ నిర్ణయం సినిమాకు ప్లస్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎందుకంటే శ్రీలీల తన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమా మొత్తానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్‌ను ఆకర్షించడంలో ఆమె పాత్ర కీలకంగా మారింది. ఈ సినిమా తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మొత్తానికి.. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులను మెప్పించడంలో సక్సెస్ కాగా, శ్రీలీలకు ఇది కెరీర్ టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చర్చనీయాంశంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X