Sreeleela Remuneration: శ్రీలీలకు రెమ్యునరేషన్.. ఉస్తాద్ భగత్ సింగ్‌కి పారితోషికం ఎన్ని కోట్లంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్‌పై ప్రస్తుతం అందరి చూపు నెలకొంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మార్చి 26న రావాల్సిన ఈ మూవీ.. టాక్సిక్ వాయిదా పడటంతో ఉగాది బరిలో నిలిచింది. మార్చి 19న వరల్డ్ వైడ్‌గా పవన్ కళ్యాణ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 14 ఏళ్ల తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్‌లో పవన్‌కు హీరోయిన్‌గా నటించిన శ్రీలీలకు పారితోషికం ఎంత? అనేది పరిశీలిస్తే..

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంత?
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌లు దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, చమ్మక్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత దాదాపు 14 ఏళ్లకు హరీశ్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలుత మార్చి 26వ తేదీన రిలీజ్‌ను ఖరారు చేసుకున్న ఈ చిత్రం అనూహ్య పరిణామాల మధ్య ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకురానుంది.

Ustaad Bhagat Singh Sreeleela gets Shocking Remuneration for Pawan Kalyan s Movie

వరుస ఫ్లాపులు.. అయినా ఆఫర్లతో హల్‌చల్
కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టి తన క్యూట్ లుక్స్, అందం, డ్యాన్సింగ్ స్కిల్స్‌తో అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు శ్రీలీల. చిన్న వయసులోనే మహేశ్ బాబు, అల్లు అర్జున్, రవితేజ వంటి అగ్రనటులతో నటించే అవకాశం దక్కించుకున్నారు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ తన అదృష్టంతో కంటిన్యూగా ఆఫర్లు అందుకుంటున్నారు శ్రీలీల. చిన్న హీరోలు, సీనియర్ హీరోలకు శ్రీలీల ఫస్ట్ ఛాయిస్‌గా మారారు.

పాన్ ఇండియా హీరోయిన్‌గా అడుగులు
తెలుగులో టాప్ హీరోయిన్ అనిపించుకున్న శ్రీలీల.. పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదిగే ప్లానింగ్‌లో ఉన్నారు. ఇప్పటికే కన్నడంలో నటించిన శ్రీలీల... పుష్ప 2లోని కిస్సింగ్ సాంగ్‌తో నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నారు. తెలుగులో అగ్రనటిగా దూసుకెళ్తుండగా... ఇటీవలే తమిళంలో ఎంట్రీ ఇచ్చారు. శివకార్తీకేయన్ హీరోగా నటించిన పరాశక్తి ద్వారా కోలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ వెంటనే మరో తమిళ చిత్రంలో అవకాశం దక్కించుకున్నారు శ్రీలీల. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తోన్న మూవీలో ఆయన సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో లేడీ పవర్‌స్టార్ సాయి పల్లవి మరో హీరోయిన్ కావడం విశేషం. అటు బాలీవుడ్‌లో జెండా పాతడానికి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు శ్రీలీల. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

శ్రీలీల రెమ్యునరేషన్ ఎంతంటే?
ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్‌లో నటిస్తున్నారు శ్రీలీల. తన కెరీర్‌లోనే తొలిసారిగా పవన్ వంటి సూపర్‌స్టార్‌తో నటిస్తుండటంతో ఆమె చాలా సంతోషంగా ఉన్నారు. పవన్‌తో శ్రీలీల కెమిస్ట్రీ అదిరిపోయిందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే పవన్‌తో శ్రీలీల వేసిన స్టెప్పులు థియేటర్‌లో పూనకాలు తెప్పిస్తాయని మేకర్స్ చెబుతున్నారు. అయితే సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళ్తున్న శ్రీలీల.. ఉస్తాద్ కోసం పారితోషికంగా ఎంత తీసుకున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న దాని ప్రకారం.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం శ్రీలీల 2 నుంచి 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర చిత్రానికి గాను శ్రీలీల 3 కోట్ల రూపాయల వరకు పారితోషికంగా అందుకున్నారని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీనికి ముందు చేసిన జూనియర్‌కు 4 కోట్ల రూపాయలు, రాబిన్‌హుడ్‌కు 2 కోట్ల రూపాయల వరకు ఆమె ఛార్జ్ చేశారు. పరాశక్తి మూవీకి కోటి రూపాయలే పారితోషికంగా తీసుకున్నారట. ఇప్పుడు ఉస్తాద్ విషయంలోనూ రెమ్యునరేషన్‌ని శ్రీలీల పెంచలేదని చెబుతున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X