రామ్ చరణ్ కోసం ఆ దర్శకుడిపై ఫోకస్ చేసిన యూవీ క్రియేషన్స్.. మరో బిగ్ కాంబినేషన్!

రామ్ చరణ్‌తో యువి క్రియేషన్స్ ఓ సినిమా ప్లాన్ చేస్తోందని గత కొంతకాలంగా ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తోంది. రామ్ చరణ్ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకున్న నటుడిగా ఎదుగుతూ ఉండడంతో యువీ అతనితో నెవ్వర్ బిఫోర్ అనేలా సినిమా చేయాలని ఆలోచిస్తుంది.

ఇక UV క్రియేషన్స్ ప్రేక్షకుల అంచనాలను అందుకునేందుకు కొత్త ఆలోచనలను తెరపైకి తీసుకురాగల ప్రతిభావంతులైన దర్శకుల కోసం వెతుకుతోంది. గతంలో పలు కథలతో యువి క్రియేషన్స్ రామ్ చరణ్‌ని సంప్రదించిందట. అయితే ఏ ఒక్కటీ కూడా చరణ్ కు అంతగా నచ్చలేదట. ఇక ఇప్పుడు యువి క్రియేషన్స్ తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్‌పై దృష్టి పెట్టినట్లు సమాచారం.

Uv creations focus on top director for ram charan project

ఈ టాలెంటెడ్ దర్శకుడు మాస్టర్, విక్రమ్ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు లోకేష్ కోసం తెలుగు చిత్ర పరిశ్రమలోని అనేక నిర్మాణ సంస్థలు సంప్రదిస్తున్నాయి. అయితే లోకేష్ కనగరాజ్ తో రామ్ చరణ్ కు కథను చెప్పించాలని యూవీ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Uv creations focus on top director for ram charan project

ఇక ప్రస్తుతం లోకేష్ విజయ్ తో లియో అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే అతను గతంలో ఎన్టీఆర్ తో కూడా వర్క్ చేయాలని అనుకుంటున్నారు కథనాలు వెలుపడ్డాయి. ఇక విజయ్ సినిమా అనంతరం లోకేష్ ఎవరితో వర్క్ చేస్తాడు? అని విషయంలో కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అతను తన కథలను మల్టీవర్స్ రూపంలో మరింత గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నట్లు తెలియజేశాడు. మరి రామ్ చరణ్ టెజో కూడా అలాంటి ప్రయోగమే చేస్తాడో లేదో కాలమే సమాధానం చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X