డార్లింగ్ ఫ్యాన్స్ కు ప్రేమికుల రోజున స్పెషల్ గిఫ్ట్.. మళ్ళీ హ్యాండ్ ఇవ్వరు కదా?
రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా భవిష్యత్తులో బాక్సాఫీస్ వద్ద ఒక రేంజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తాయని ఈజీగా అర్ధమవుతోంది. అలా ఉంది మరి రాజుగారి లైనప్. ఇక హీరోతో వర్క్ చేయాలని అనుకునే దర్శకులు కూడా నెవర్ బిఫోర్ అనేలా పాన్ ఇండియా కాన్సెప్ట్ లతోనే వస్తున్నారు. ప్రస్తుతం ప్రబాస్ లైనప్ కెరీర్ కు మరో మేజర్ ప్లస్ పాయింట్ లా మరనుందని చెప్పవచ్చు. ఇక గత ఏడాది సినిమా షూటింగ్స్ లేక కొందరు ఇబ్బంది పడ్డప్పటికి ప్రభాస్ మాత్రం ఆ టైమ్ ను చాలా అద్భుతంగా ప్లాన్ చేసుకున్నాడు. ఈ ఏడాది లో వరుసగా సినిమాలతో బిజీ కానున్నాడు.

ఈ ఏడాది రెండు సినిమాలు అనుకున్నారు..
2020 కరోనా ధాటికి చాలా మంది జీవితాలలో పెను మార్పులను తెచ్చిందనే చెప్పాలి. టాలీవుడ్ హీరోలతే చాలా వరకు భవిష్యత్తు ప్రాజెక్టులను చాలా బలంగా సిద్ధం చేసుకుంటున్నట్లు అర్ధమయ్యింది. ఇక ప్రభాస్ అంచనాలకు మించిన పాన్ ఇండియా కథలను రెడీ చేసుకున్నాడు. ఇక ఈ ఏడాది రెండు సినిమాలతో సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు ప్లాన్ చేసుకున్నప్పటికీ కుదరలేదు.

రాధేశ్యామ్ సర్ ప్రైజ్
ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ అయిపోగానే వెంటనే మరో సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. లాక్ డౌన్ లోనే షూటింగ్స్ విషయాల్లో ప్రభాస్ పక్కా ప్లాన్ తో రెడీ చేసుకున్నాడట. ఇక ముందుగా రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

సినిమా టీజర్ వచ్చేది ఆ రోజే..
ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం రాధేశ్యామ్ సినిమా యొక్క టీజర్ ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. డార్లింగ్ ఫ్యాన్స్ కోసం ఫిబ్రవరి 14న ప్రత్యేకంగా టీజర్ ను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నట్లు సమాచారం. యూవీ క్రియేషన్స్ గోపికృష్ణ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాను జులై 9న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Recommended Video

మళ్ళీ హ్యాండ్ ఇవ్వరుగా
2018లో సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా రెండేళ్లకు పైగా షూటింగ్ దశలోనే ఉంది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అప్డేట్స్ అయితే చాలా పూర్ గా ఉన్నాయని అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫిబ్రవరి 14న పక్కా టీజర్ తో వస్తారని ఇన్ సైడ్ టాక్. ఆ రోజు మిస్సయితే అంతకంటే స్పెషల్ టైమ్ మరొకటి దొరకదు. ఇక చిత్ర యూనిట్ మళ్ళీ హ్యాండ్ ఇవ్వరుగా అంటూ ఓ వర్గం ఆడియెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











