twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో కుర్ర డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన యూవీ సంస్థ.. పెద్ద ప్లానే వేశారుగా !

    |

    తెలుగులో ఎక్కువగా కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తున్న సంస్థల్లో యూవీ క్రియేషన్స్ సంస్థ ఒకటి. ప్రభాస్ సన్నిహితులు వంశీ, ప్రమోద్ ఇద్దరూ కలిసి ఈ సంస్థను ప్రారంభించారు. ఇప్పటికే ఈ సంస్థ తరఫున చాలా మంది కొత్త దర్శకులు తెరమీదకు వచ్చారు. అలా యువీ సంస్థ నుంచి బయటకు వచ్చిన సుజిత్ మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకోవడంతో ఏకంగా రెండో సినిమా ప్రభాస్ తో చేసే అవకాశం దక్కించుకున్నాడు. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కూడా దాదాపు అంతే. కాకపోతే ఆయన మొదటి సినిమా జిల్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినా రాధే శ్యామ్ చేసే అవకాశం ఇచ్చారు.

    మరోపక్క మేర్లపాక గాంధీ కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఒకపక్క బడా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా మరోపక్క చిన్న సినిమాలు చేయాలని యువి క్రియేషన్స్ సంస్థ ఒక సపరేట్ బ్యానర్ కూడా ఏర్పాటు చేసింది. తాజాగా ఈ బ్యానర్ నుంచి మరో కొత్త దర్శకుడికి అవకాశం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

    UV Creations to launch another New director Deepak reddy

    మనసామహా అనే 16 నిమిషాల షార్ట్ ఫిలిం చేసి మంచి పేరు తెచ్చుకున్న దీపక్ రెడ్డి అనే దర్శకుడికి ఈ సంస్థ నుంచి ఫీచర్ ఫిలిం చేయమని ఆఫర్ లభించినట్లు సమాచారం పలు షార్ట్ ఫిలిమ్స్ చేసి ఫిదా లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన దీపక్ రెడ్డి త్వరలోనే ఈ సంస్థ ప్రతినిధులకు కధ వినిపిస్తాడని ఒకవేళ కథ కూడా వారికి నచ్చితే వీలైనంత త్వరలో అధికారిక ప్రకటన కూడా విడుదల చేసి సినిమా ప్రారంభిస్తారని అంటున్నారు. థియేటర్ రిలీజ్ లకే కాక డిజిటల్ రిలీజ్ కోసం కూడా యు.వి క్రియేషన్స్ సంస్థ సినిమాలను సిద్ధం చేయాలని భావిస్తున్న తరుణంలో వీలైనంత మంది కొత్త దర్శకులతో సినిమాలు చేయించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

    English summary
    As per the latest reports Deepak, who is known for short film Manasanamaha, has been approached by the UV Creations offering an opportunity to helm a film for the silver screen.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X