'సైరా'పై కన్నేసిన సాహో నిర్మాతలు.. భారీ మొత్తం చెల్లించి!

బాహుబలి సినిమా తర్వాత మళ్ళీ అంతటి భారీ రేంజ్ సినిమా చేస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ 'సాహో’ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నిర్మాణంలో భాగమవుతూనే మెగాస్టార్ చిరంజీవి సినిమా హక్కులను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోందట యూవీ క్రియేషన్స్ యాజమాన్యం.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా హిస్టారికల్ నేపథ్యంలో భారీ హంగులతో తెరకెక్కుతోంది 'సైరా నరసింహా రెడ్డి' సినిమా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు మెగా అభిమానులు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఆ సినిమాతో సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ఆయన తదుపరి సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఈ నేపథ్యంలో సైరా డిస్ట్రిబ్యూషన్ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది.

 UV Creations will take Sye Raa Rights..?

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సైరా హక్కుల కోసం పోటీ పడుతున్నారట డిస్ట్రిబ్యూషన్ సంస్థలు. ఈ చిత్ర హక్కులను దక్కించుకోవడం కోసం భారీ మొత్తం ఆఫర్ చేస్తున్నారట. తాజాగా యూవీ క్రియేషన్ క్రియేషన్స్ కూడా రంగంలోకి దిగి ఏపీ హక్కుల కోసం భారీ మొత్తం చెల్లించి 'సైరా నరసింహా రెడ్డి' రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే భారీ ఎత్తున నిర్మిస్తున్న సాహో, భారీ మొత్తానికి కొనుగోలు చేసిన 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలు యూవీ యాజమాన్యానికి ఏ మేర లాభాలు తెచ్చిపెడతాయో చూడాలి మరి.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సైరా నరసింహా రెడ్డి చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా.. తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. అమితాబ్ బచ్చన్, కుచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు లాంటి భారీ తారాగణం పాలు పంచుకుంటున్నారు. అక్టోబర్ 2 వ తేదీన భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X