విశ్వంభర సినిమాలో స్టార్ డైరెక్టర్.. దిమ్మతిరిగే పాత్రను చేస్తున్నాడుగా!
తెలుగు సినిమా పరిశ్రమలో చాలా తక్కవ మంది హీరోలు మాత్రమే స్టార్‌డమ్‌ను సుదీర్ఘ కాలంగా కొనసాగిస్తున్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్న ఆయన.. ఎవరూ ఊహించని రీతిలో వేగంగా మూవీలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా రీఎంట్రీలో వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు.
ఈ మధ్య ఫుల్ జోష్‌తో దూసుకుపోతోన్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు 'విశ్వంభర' అనే సినిమాలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపై హైప్ ఆదిలోనే భారీ స్థాయిలో ఏర్పడింది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కలయికలో తెరకెక్కుతోన్న 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పలు షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. ఇందులో చిరంజీవితో పాటు త్రిష మిగిలిన నటీనటులతో షూట్ జరిపారు. మొత్తంగా ఈ సినిమా 40 శాతం టాకీ పార్టును పూర్తి చేసేశారు.
టెక్నికల్ వండర్‌గా రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ కోసం పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను ఎంపిక చేస్తున్నారు. అయితే, ఇందులో ముఖ్యమైన పాత్ర కోసం టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్‌ను సెలెక్ట్ చేసినట్లు తెలిసింది. ఆయన ఎవరో కాదు.. వీవీ వినాయక్ అని సమాచారం.

హై రేంజ్ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'విశ్వంభర' మూవీలో వీవీ వినాయక్ ఓ ముఖ్యమైన పాత్రను చేస్తున్నట్లు తాజాగా న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో అతడి రోల్ ఎవరూ ఊహించని విధంగా ఉండబోతుందట. త్వరలోనే ఈ స్టార్ డైరెక్టర్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడని అంటున్నారు. ఇటీవల వీవీ వినాయక్ అందుకే 'విశ్వంభర' సెట్‌కు వెళ్లారని అంటున్నారు.
ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా.. సురభి, ఈషా చావ్లా కీలక పాత్రలను చేస్తున్నారు. దీనికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











