మరో సినిమా కోసం అడ్వాన్స్ అందుకున్న వైష్ణవ్ తేజ్..?
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ మొదటి సినిమాతోనే ఎవరు ఊహించని ప్రయోగాత్మకమైన కథను ఎంచుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ అత్యదిక ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో అది కూడా ఒకటి. ఇప్పటికే 100కోట్ల కలెక్షన్స్ అందుకున్నట్లు చిత్ర యూనిట్ పోస్టర్స్ తో ప్రమోషన్ డోస్ కూడా పెంచేసింది.
అయితే ఉప్పెన ఇచ్చిన ఎనర్జీతో అదే తరహాలో సినిమాలను ఓకే చేస్తున్నాడు యువ హీరో వైష్ణవ్ తేజ్. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కథను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆల్ మోస్ట్ పూర్తయ్యాయి. ఇక నెక్స్ట్ నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణ ప్రొడక్షన్ లోనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు టాక్.

అలాగే మరో సీనియర్ నిర్మాత BVSN ప్రసాద్ ప్రొడక్షన్ లో కూడా ఒక సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు టాక్ వస్తోంది. నిర్మాత అడ్వాన్స్ కూడా ఇచ్చేశారట. అయితే కథ ఇంక ఫైనల్ కాలేదట. ఇప్పటికే వైష్ణవ్ కోసం రెండు కథలను సెట్ చేసిన నిర్మాత త్వరలోనే ఎదో ఒక దాన్ని ఫిక్స్ చేసి మళ్ళీ డెవలప్ చేస్తారని సమాచారం. వీలైతే ఈ సమ్మర్ లోనే వైష్ణవ్ మరో సినిమాని స్టార్ట్ చేస్తాడని టాక్ వస్తోంది. మరి ఆ సినిమాలు ఏ రేంజ్ లో హిట్టవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











