Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ కళ్యాణ్ దర్శకుడితో వైష్ణవ్ తేజ్ బిగ్ ప్లాన్.. మళ్ళీ పదేళ్ల తరువాత తెలుగులో..?
మొదటి సినిమాతోనే భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న లక్కీ హీరో వైష్ణవ తేజ్ భవిష్యత్తులో కూడా అదే తరహాలో కొనసాగే విధంగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. మొదటి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా లో వైష్ణవ్ తేజ్ నటించిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఒక ప్రయోగాత్మకమైన కథను సెలెక్ట్ చేసుకోవడం అంటే చాలా రిస్క్ తో కూడుకున్న పని. కానీ వైష్ణవ్ తేజ్ మొదట్లోనే అలాంటి ప్రయోగాన్ని దాటి వచ్చాడు కాబట్టి భవిష్యత్తులో కూడా అతను మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నట్లు చెప్పవచ్చు.
ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ కొండపొలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. దసరా సమయంలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కొండపొలం అనంతరం కూడా వీలైనంత త్వరగా మరొక సినిమాను విడుదల చేయాలని వైష్ణవ్ తేజ్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైష్ణవ్ తేజ్ గిరీషయ దర్శకత్వంలో ఒక సినిమా ని స్టార్ట్ చేశాడు. ఆ దర్శకుడు తమిళంలో అర్జున్ రెడ్డి రీమేక్ ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇటీవల వైష్ణవ్ తేజ్ ఒక తమిళ దర్శకుడుతో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు ఇదివరకు పవన్ కళ్యాణ్ తో పంజా సినిమా డైరెక్ట్ చేసినటువంటి విష్ణువర్ధన్. అతనితో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇటీవల ఈ దర్శకుడు డైరెక్ట్ చేసినటువంటి షేర్షా సినిమా కూడా మంచి ప్రశంసలు అందుకుంది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. మొత్తానికి చాలా కాలం తర్వాత తెలుగులో ఒక మంచి సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఒక బడా నిర్మాణ సంస్థ ఈ కాంబినేషన్ ను కలిపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. విష్ణువర్ధన్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో ఆఫర్స్ వస్తున్నప్పటికీ కూడా అతను వైష్ణవ్ పై ఫోకస్ పెడుతున్నాడు అంటే తప్పకుండా ఏదో డిఫరెంట్ సినిమా అయ్యి ఉంటుందని చెప్పవచ్చు.
అయితే 2011లో విష్ణువర్దన్, పవన్ కళ్యాణ్ తో చేసిన పంజా సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. అసలైతే ఆ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసింది. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని అనుకున్నారు. కానీ సినిమా సెకండాఫ్ తేడా కొట్టడంతో ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయింది. అయినప్పటికీ విష్ణువర్ధన్ పవన్ కళ్యాణ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరూ కలిసి మరో సినిమా చేయాలని అనుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం తో అటువైపు చూడలేదు. ఒకవేళ విష్ణు తీసిన సినిమా సెట్ అయింది అంటే మళ్లీ పవన్ కళ్యాణ్ తో కూడ సినిమా చేసే అవకాశం లేకపోలేదు. మరి ఆ దర్శకుడు తన తదుపరి సినిమాను బాలీవుడ్ లోనే చేస్తాడా లేక సౌత్ సినిమాలతో బిజీ అవుతాడా లేదా అనేది చూడాలి.