విశ్వంభర సినిమాలో మరో మెగా హీరో.. చిరంజీవితో రెండో హిట్ కొట్టినట్టే!
టాలీవుడ్‌లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా హవాను చూపిస్తూ నెంబర్ వన్ హీరోగా సత్తా చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు ఆరు పదుల వయసు దాటేసినా ఏమాత్రం బ్రేక్ లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా రీఎంట్రీలో జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు.
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట రూపకల్పనలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రమే 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని హై రేంజ్‌లో తీస్తున్నారు. అంతేకాదు, చిరంజీవి కెరీర్‌లోనే గతంలో ఎన్నడూ పెట్టనంత బడ్జెట్‌ను పెడుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ ఏడాదిలోనే మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పలు షెడ్యూళ్లను విజయవంతంగా పూర్తి చేశారు. ఇందులో చిరంజీవితో పాటు త్రిష మిగిలిన నటీనటులతో షూట్ జరిపారు. మొత్తంగా ఈ సినిమాకు సంబంధించి 30 శాతం టాకీ పార్ట్ ఫినీష్ చేశారు.
విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న 'విశ్వంభర' సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారు. అయితే, ఇందులో ముఖ్యమైన పాత్ర కోసం మెగా ఫ్యామిలీకి చెందిన ఓ యంగ్ హీరోను సెలెక్ట్ చేసినట్లు తెలిసింది. అతడే టాలెంటెడ్ గాయ్ పంజా వైష్ణవ్ తేజ్.

'విశ్వంభర' మూవీలో పంజా వైష్ణవ్ తేజ్ ఓ ముఖ్యమైన పాత్రను చేస్తున్నట్లు తాజాగా న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో అతడి రోల్ ఎవరూ ఊహించని విధంగా ఉండబోతుందట. త్వరలోనే ఈ మెగా హీరో షూట్‌లో పాల్గొనబోతున్నాడని అంటున్నారు. గతంలో 'శంకర్ దాదా ఎంబీబీఎస్' మూవీలోనూ వైష్ణవ్ నటించాడు. అది హిట్ అయింది. ఇప్పుడు ఈ సెంటిమెంట్ ప్రకారం 'విశ్వంభర' కూడా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కలయికలో రూపొందుతోన్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా.. సురభి, ఈషా చావ్లా కీలక పాత్రలను చేస్తున్నారు. దీనికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.


Click it and Unblock the Notifications











