ఆ బోల్డ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైష్ణవ్ తేజ్
మెగా హీరో వైష్ణవ్ తేజ్ గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు ఒకే చేస్తున్నాడు. ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ అంతకుముందే క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే. కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమాకు జంగిల్ బుక్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు టాక్ వస్తోంది.
అలాగే ఒకరిద్దరు దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్న వైష్ణవ్ తేజ్ త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఉప్పెన బజ్ పెరిగిన సమయంలోనే సీనియర్ నిర్మాత BVSN ప్రసాద్ కూడా వైష్ణవ్ తేజ్ డేట్స్ తీసేసుకున్నారు. ఇక అతని కోసం రెండు కథలపై గత కొంతకాలంగా చర్చలు జరిపిన ఆయన ఇటీవల ఒకటి ఫైనల్ చేసినట్లు సమాచారం.

ఇక ఆ సినిమాను డైరెక్ట్ చేయబోయేది మరెవరో కాదు. అర్జున్ రెడ్డి కథను తమిళ్ లో రీమేక్ చేసిన గిరిసయ్య. ఆదిత్య వర్మ అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికి అతని మేకింగ్ స్టైల్ ను నమ్మి మరోసారి అవకాశం ఇస్తున్నారు నిర్మాత. ఇదివరకే అతను సమంతతో ఒక త్రిల్లర్ సినిమాను చేయనున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కోసం కథను రెడీ చేసినట్లు సమాచారం. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











